Breaking News

మానవ అక్రమ రవాణా నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు గ్రామ స్థాయి నుంచి సమన్వయం తో పని చేయాలి

సత్తెనపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లాలో మానవ అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి ” జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్” కృషిచేస్తుందని ఇందుకై జిల్లాలోని మహిళా సంరక్షణ కార్యాదర్సుల పాత్ర చాలా ముఖ్యమని సత్తెనపల్లి ఇంచార్జి సిఐ సురేష్ కుమార్ అన్నారు. నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఏం. వి.ఆర్. ఫంక్షన్ హాల్ లోని సమావేశ మందిరంలో హెల్ప్ సంస్ధ మరియు జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ ఆధ్వర్యంలో ” మానవఅక్రమ రవాణా- నిరోధంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల పాత్ర” అనే అంశంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇటీవల పల్నాడు జిల్లా క్రైమ్ కంట్రోల్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. విజయకృష్ణ సారధ్యంలో జిల్లా స్థాయి మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ ప్రారంభించటం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న, సురేష్ కుమార్ మాట్లాడుతూ నేరాలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేసి విచారణ జరపడం కన్నా ఆ నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించటం చాలా ముఖ్యం అని అన్నారు.ఇందుకోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు, తమ గ్రామాలలో అత్యంత పేదరికం, ఇబ్బందులతో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి ముందుగానే కౌన్సెలింగ్ చేయటం, నిరంతరం వారికి తోడుగా, అండగా ఉండటం ద్వారా ఆ కుటుంబాల నుండి ఎవ్వరు అక్రమ రవాణా కు గురికాకుండా నిరోధించవచ్చు అన్నారు.

ఈ సమావేశంలో హెల్ప్ ప్రొగ్రమ్ మేనేజర్  భాస్కర్ రావు అక్రమ రవాణా నిరోధం లో పోలీస్ అధికారులు మరియు గ్రామ స్థాయి మహిళ సంరక్షణ అధికారుల పాత్ర అనే అంశంపై శిక్షణ, అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ గౌతమి, అల్లూరి రెడ్డి , మహిళా పోలీస్ మరియు మానవ అక్రమ రవాణా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *