-జిల్లా కలెక్టర్ మాధవి లత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం వర్షాలు వరదలు మూలంగా ఈ వారం జూలై 18 న నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ , డివిజన్ పరిధిలో, మండల పరిధిలో, సచివాలయ పరిధిలో ఈ వారం స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందన్నారు. కావున స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలు గమనించాలని ఆమె తెలియజేశారు.
Prajavartha Online Telugu News