Breaking News

వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేశాం…

-లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది..
-ఏరియల్ సర్వే ద్వారా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్ట్ నుంచి ఆదివారం బయలుదేరి వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ఏరియల్ సర్వే కార్యక్రమంలో తూ.గో. జిల్లా ఇంఛార్జి మంత్రి, బీసీ సంక్షేమం,రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా ముంపుకు గురైన గోదావరి పరివాహాక ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ ఏరియల్ సర్వే లో తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద వల్ల ముంపునకు గురైన ప్రాంతాలని పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా దిగువకు విడుదల చేసిన వరద నీరు వెళ్ళే తీరును పరిశీలించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నదని మంత్రులు తెలిపారు.

వరద ముంపు ప్రాంతాల వలన పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయయని క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేయడానికి మరోసారి ఏరియల్ సర్వే చేయడం జరిగిందన్నారు. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన రిపోర్ట్ ను సంబంధిత అధికారుల ద్వారా ముఖ్యమంత్రి కి అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు,ధవళేశ్వర్యం బ్యారేజీ,లంక ముంపు గ్రామాల్లోని పరిస్థితులను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉన్నారాన్నారు. రాబోయే 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశామన్నారు.

వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని ముంపు ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని సూచించామన్నారు. గత నాలుగు రోజులుగా జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయి లో కార్యచరణ ప్రణాళిక ప్రకారం అహర్నిశలు పనిచేస్తూన్నరన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, మీడియా తదితర విభాగాలు ప్రజలను అప్రమత్తం చెయ్యడంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *