విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్య వైశ్య అన్నపూర్ణ వర్కర్స్ సంఘం (సోమరంగం చౌక్ శ్రీను హోటల్ ఎదురుగా) వారి ఆధ్వర్యంలో శ్రీ గంగానమ్మ కంటాస్నాన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మండెపూడి చటర్జీతో కలిసి హాజరై అమ్మవారి అభిషేక కార్యక్రమంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముందుగా గంగానమ్మ ఆలయం వద్ద నుండి ఊరేగింపుగా కలశాలతో కృష్ణా నది నుండి జలాన్ని సేకరించి ఐరన్ సెంటర్ మీదుగా సోమవారం చౌక్ వరకు భక్తుల నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చిన కృష్ణా నది జలాలను అమ్మవారికి అభిషేకం చేసినారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి నదీ జలాలతో అభిషేకం చేసినారు. గంగానమ్మ ఆశీస్సులతో సమాజంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ఋతువులు సక్రమంగా నడవాలని, రైతులకు మేలు కలగాలని మహేష్ గంగానమ్మ అమ్మవారి ని ప్రార్థించారు.
Prajavartha Online Telugu News