Breaking News

నీటి కాలుష్యాన్ని అరికట్టoడి…

-నగరంలో పారిశుధ్య పనులను పరిశీలించిన : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుదవారం 48, మరియు 51 వ డివిజన్ లో పలు విధులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలను పరిశీలించి సత్వరమే వాటిని పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్స్ ద్వారా మురుగునీటి పారుదల తీరును పరిశీలించి మురుగునీటి పారుదల సక్రమముగా జరగని డ్రెయిన్స్ నందు తక్షణమే సిల్ట్ తొలగింపు పనులను చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కొండప్రాంతములో కాల్వలో నుండి పోవు వాటర్ పైప్స్ పైకి లేపి రోడ్ మార్జిన్ లో ఫిక్స్ చేయాలి, సైడ్ లైన్స్ లో మెయిన్ లైన్ వేసి దాని నుండి ఇళ్ళకు కనెక్షన్ ఇవ్వాలి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 35 వ డివిజన్ లో పూర్ణనందపేట కెనాల్ బండ్ ఫెన్సింగ్ వర్క్ వెంటనే కంప్లీట్ చేయాలి, ఫ్రైజేర్ పేట మెయిన్ రోడ్ లోని నమ్మ టాయిలెట్స్ వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని, CK రెడ్డి రోడ్ లో కెనాల్ బండ్ లో పడిపోయిన ఫెన్సింగ్ ను వెంటనే రిపేర్ చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా బందరు రోడ్డు లోని ఈట్ స్ట్రీట్ నంబర్స్ కి పెయింటింగ్ వర్క్ ఇంకను పూర్తి కాలేదు దానిని వెంటనే పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *