Breaking News

ప్రజల వద్దకే పాలన వైస్సార్సీపీ ప్రభుత్వం తోనే సాధ్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైస్ జగన్మోరెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తూన్నరని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం 13వ డివిజన్ లోని 55వ సచివాలయ పరిధిలోని శివశంకర్ నగర్, తోటవారి వీధి, రామాయణపువారి వీధి ప్రాంతంలో ఇంటి ఇంటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరిస్తూ,స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు.రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ డివిజన్ లో గడప గడప కు వెళ్తుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. విద్యా, వైద్యం,సేద్యం ఈ మూడు రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు పెట్టిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలు ఎంతో సంతోషముగా వున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి పైరవీలకు తావులేకుండా తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తే స్థానిక ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని, గత ప్రభుత్వం లో ముఖ్యమంత్రి సహాయ నిధి కేవలం మీ పార్టీ వాళ్ళకి అందులో మీ జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తేనే వచ్చే పరిస్థితి ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మీ షో రాజకీయాలు, డ్రామాలు ప్రజలకు అర్థం అయ్యాయి రాబోయే ఎన్నికల్లో వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి మాజి కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్, వైసీపీ నాయుకులు ఉకోటి రమేష్, శ్రీను, కోలా ఉమా, పిడుగు విజయ్, అబ్దుల్ హనాన్, పల్లి రమేష్, పల్లి ప్రకాష్, గుండు సతీష్, చాణిక్య బాబురావు, ధనుష్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *