Breaking News

APSRTC సెంట్రల్ హాస్పిటల్, ట్రైనింగ్ కాలేజి లను సందర్శించిన చైర్మన్  ఏ. మల్లికార్జున రెడ్డి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. చైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి  బుధవారం విజయవాడ విద్యాధరపురం నందు గల APSRTC సెంట్రల్ హాస్పిటల్ ను సందర్శించారు. విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వర రావు మరియు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డి.వి.ఎస్. అప్పారావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి లోని అన్ని విభాగాలను పరిశీలించారు. జనరల్ మెడిసిన్, డెంటల్, ఆర్థో, ఆప్తాల్మాలజీ తదితర వివిధ విభాగాల్లో సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్న సేవలను సీనియర్ మెడికల్ ఆఫీసర్ డి.వి.ఎస్. అప్పారావు వివరించారు. ఛైర్మన్  ఏ. మల్లికార్జున రెడ్డి ఆపరేషన్ థియేటర్లు, సిబ్బందికి కేటాయించిన వసతి సదుపాయాలు తదితర వాటిని గమనించి రోగులకు అందిస్తోన్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు మరియు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వైద్యం అందించాలని CMO మరియు సిబ్బందికి సూచించారు. అనంతరం హాస్పిటల్ కి చేరువలో ఉన్న ZSTCని సందర్శించి, అక్కడ కొనసాగుతున్న డిపో మేనేజర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని విలువైన ప్రసంగాన్ని అందించారు. APSRTC యొక్క ప్రస్తుత ఆర్థిక స్థితిని వివరించి, సంస్థను నష్టాల నుండి బయటకు తీసుకురావడానికి మరియు లాభాలను పొందేందుకు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. చివరగా టైర్ రీట్రేడింగ్ షాప్ సందర్శించి, అన్ని వింగ్లను పరిశీలించారు. టైర్ రీట్రేడింగ్పై జరుగుతున్న కార్యకలాపాలను గమనించారు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్శనలో ఛైర్మన్ తో పాటు విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వేంకటేశ్వర రావు, విజయవాడ జోన్ Dy.CAO కే.రామచంద్ర రావు, వర్క్స్ మేనేజర్ వాణిశ్రీ, AME(టైర్స్) నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *