Breaking News

కోవిడ్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం…

-కోవిడ్‌ నిబంధనలు పాటించేలా ప్రజలలో చైతన్యం తీసుకువస్తున్నాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కోవిడ్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని 18 సంవత్సాల నుండి 60 సంవత్సరాలలోపు వారికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును పంపిణీ చేయడంతోపాటు ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు తెలిపారు.
కోవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్స్‌రెన్స్‌ నిర్వహించారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి వీడియోకాన్స్‌రెన్స్‌లో పాల్గొన్నా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోవిడ్‌ నియంత్రణ చర్యలను వివరిస్తూ జిల్లాలో జూన్‌ మాసం నుండి ఇప్పటివరకు 10,122 కోవిడ్‌ టెస్టులు నిర్వహించగా 998 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అయిన్నట్లు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 390 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 380 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని, 22 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, మరో 20 మందిని ఈ రోజు డిశ్చార్జ్‌ చేసిన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్‌ రోగుల కొరకు 80 బెడ్లను సిద్దంగా ఉంచామన్నారు. వీటిలో 15 ఐసియు బెడ్స్‌కాగా మిగిలిన 65 నాన్‌ ఐసియు ఆక్సిజన్‌ బెడ్స్‌ అని వివరించారు. కోవిడ్‌ 4వ దశలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుసున్నామన్నారు. కోవిడ్‌ నిబంధనలో భాగంగా మాస్క్‌ ధరించడం, చేతులను శుభ్రపరచుకోవడం వంటి చర్యలను పాటించేలాగా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌యంలు, అంగన్‌వాడీ సిబ్బందితో ఫీవర్‌ సర్వే నిర్వహించి కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు గమనించిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రోజుకు 5వేల ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు నిర్వహించేలా లేబరెటరీ సామర్ధ్యన్ని పెంచడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *