విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరుపున రాష్ట్ర ప్రదానకార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాష్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిను గురువారం కలిసి రాష్ట్రం లో 116 ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సెర్ లో వున్న మెడికల్ ఆఫీసర్ పోస్ట్స్ భర్తీ చేయాలని, రాష్ట్ర ఆయుష్ అధికారులు మెడికల్ ఆఫీసర్ లు లేని ఆసుపత్రి లను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం కి పంపించాలని జరుగుతున్న ప్రయత్నాలను ఆపించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెప్పించుకొని ఆయుర్వేద వైద్య విధానం, నిరుద్యోగ ఆయుర్వేద వైద్యులు ఉద్యోగ అవకాశాలు కలిపించడానికి కృషి చేస్తానని మంత్రి సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ వేముల భానుప్రకాష్ తెలిపారు.
Prajavartha Online Telugu News