Breaking News

చదువుల తల్లికి అండగా నిలిచిన మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పదహారేళ్ళ పూజిత జీవితం కష్టాలమయం.. ఆమె తండ్రి పదేళ్ల క్రితం చనిపోయారు, తల్లి ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని ఎంతో భారంగా పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బులసర పూజిత గత ఏడాది పెడన లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదివి 9. 3 మార్కులు సాధించింది. ఆ తర్వాత ఏడాది మచిలీపట్నంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ చేరి తన చదువును కొనసాగిస్తోంది.. ఇంజినీర్ కావాలనే ద్యేయం తో కష్టపడి చదివె సమయంలో కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు తల్లికి సహాయం చేసే నేపథ్యంలో జూనియర్ ఇంటర్ లో రెండు సబ్జక్ట్ లలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీనికి తోడు ఆ కళాశాల యాజమాన్యం ఫస్ట్ ఇయర్ ఫీజు 25 వేల రూపాయలు వెంటనే చెల్లించాలని తీవ్ర వత్తిడి తీసుకురావడంతో పూజిత ఆలోచనలో పడింది. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం గానే ఉండడంతో డబ్బులు కట్టడం కష్టంగా మారింది. అంత సొమ్ము చెల్లించేందుకు తమ ఆర్ధిక పరిస్థితి సహకరించిందని నిర్ణయించుకొని తన తమ్ముడినైనా శ్రద్దగా చదివించాలని, అమ్మకు సహాయం చేయాలని సీనియర్ ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపక ఇంటివద్దనే నిస్సహాయంగా ఉండిపోయింది పూజిత.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెడన మున్సిపల్ పరిధిలోని 2, 3 వార్డులలో పర్యటించారు. సరిగ్గా దేవుడే ఆమె ఇంటికి మంత్రిని పంపినట్లు.. వారి ఇంటి ముందు నిలిచి ‘ ఏం ..తల్లి నీవు ఏమి చదువుతున్నవురా ? అంటూ ఆప్యాయంగా తన తండ్రి పిలిచినట్లు మంత్రి అడిగేసరికి పూజిత కంట్లో కన్నీరు చెమ్మగిల్లింది. తన కుమార్తెకు చదువు అంటే ఎంతో ఆసక్తి అని కానీ, తమ పేదరికం కారణంగా కళాశాలకు ఫీజులు చెల్లించలేని దుస్థితిలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో చదువు మాన్పించివేసినట్లు విద్యార్థిని తల్లి లక్ష్మి ప్రమీల మంత్రి జోగి రమేష్ కు జవాబు ఇచ్చింది.
వెంటనే ఆయన స్పందించి విద్యార్థిని పూజిత చదువుకు అయ్యే పూర్తి ఖర్చు తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది అని నమ్మే మంత్రి జోగి రమేష్ పేద విద్యార్థినికి సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , పూజిత చదువుకోవాలని పట్టుదల ఉంటే ఆమె ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియ జేశారు. అలాగే విద్యార్థిని పూజిత మాట్లాడుతూ తన చదువుకు సహకరిస్తున్న మంత్రి జోగి రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పూజిత కళాశాల ఫీజుల వివరాలను తెలుసుకొని తక్షణమే ఆ బాలిక రెండవ సంవత్సరం కళాశాలలో చేర్చేందుకు తగిన ఏర్పాట్లు మొదలుపెట్టామని మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ బళ్ళ రాణి గంగయ్య ను ఆదేశించారు. దీంతో పూజిత మాతృమూర్తి లక్ష్మి ప్రమీల చేతులు జోడించి మంత్రి జోగి రమేష్ సహాయానికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు . స్థానికులు ఆయన మంచి మనస్సుకు ముగ్దులయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *