Breaking News

నగర పారిశుధ్యం లో ప్రజల సహకారం ముఖ్యం

-రోడ్ల పై ఎక్కడా చెత్త ఉండరాదు
-కమిషనర్ కె.దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్ స్థానిక రెండవ వార్డు, జైల్ రోడ్, తదితర ప్రాంతాలను పరిశీలించారు. పౌరులంతా తమ ఇళ్లలోని చెత్తను చెత్త సేకరణ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త లను వేరు చేసి అందజేయాలన్నారు. నగరంలో పారిశుధ్యం కోసం వేస్తున్న చర్యలకు ప్రజల సహకారం అందించాలని, బయట ఎక్కడ చెత్త వేయరాదని ,ప్లాస్టిక్ కవర్లో పెట్టి రోడ్లపై పడేయరాదన్నారు. రోడ్లపై చెత్త నిల్వ ఉండటం వల్ల ,ఆ చెత్త డ్రైన్ ల లోకి చేరి మురుగు నీరు రోడ్ల పైకి వచ్చేస్తోందన్నారు. ఇకపై అటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించినా తగు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం లో అంటువ్యాధులు ప్రబల కుండా శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నా మన్నారు. నగర పౌరులు కూడా శానిటేషన్ సిబ్బందికి సహకరించాలన్నారు. అనంతరం వెహికిల్ యార్డ్ ను సందర్శించి రికార్డ్ లు పరిశీలించారు. సమయానికి వాహనాలన్నీ నిర్దేశించిన రూట్ లకు వెడుతున్నాయా?అని అడిగి తెలుసుకున్నారు. రిపేర్ లు ఉన్న వాహనాలకు తక్షణమే రిపేర్ లు చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోఎమ్ హెచ్ ఓ వినూత్న తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *