విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ 13వ డివిజన్ లోని 57వ సచివాలయం పరిధిలోని ఎలక్ట్రాసిటీ కాలనీ,7వ రోడ్డు, యనమలకుదురు లాకుల ప్రాంతంలో ఇంటిఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరించారు. కాలనీవాసులు అందరూ కూడా నాడు ఈ డివిజన్ స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మరలా నేడు వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది అని వారి సంతోషం వ్యక్తంచేశారు అని అవినాష్ తెలిపారు. గతంలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు, నేడు జగనన్న ప్రభ్యత్వం వచ్చాక అభివృద్ధి జరుగుతుందన్నారు. నిత్యం ఏదో ఒక డ్రామా అడుతు ఉండే తెలుగుదేశం వారు ఏ నాడైనా నగర అభిరుద్ది మీద దృష్టి పెట్టారు అని అవియాష్ ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వర్షం వస్తే కృష్ణా లంక ప్రాంతం ప్రజలు భయం తో రాత్రి పగలు నిద్రలేకుండా ఉండేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా గెలిచిన వెంటనే రిటినింగ్ వాల్ పనులు ప్రారంభించి కృష్ణలంక ప్రజలను ఆడుకున్నారు అని అవినాష్ అన్నారు. వరదల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం చెయ్యని విధంగా జగనన్న సహాయక చర్యలు చేస్తున్నారు అని అవినాష్ అన్నారు. నిత్యం ఆశత్యాలతో టిడిపి వాళ్లు ప్రజలను భయపెడుతూ నిచ రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు. ఈ వర్షలా వల్ల ప్రజలకు ఏ ఇబ్బందీ కలగకుండా వచ్చిన వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్ని అవినాష్ సూచించారు.
ఇస్త్రీ బండి పంపిణీ
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో రామదూత్ నగర్, కిర్సనాలు రోడ్డులో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన చిపిరిపల్లి పెంటయ్య అద్దె బండతో కష్ట పడుతున్న విషయం స్థానిక డివిజన్ ఇంచార్జ్ మాజి కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్ ద్వారా తెలుసుకొని వారికి జీవనోపాధి నిమిత్తం ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రూ.30,000/- విలువ గల ఇస్త్రీ బండిని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి మాజి కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్, వైసీపీ నాయుకులు ఉకోటి రమేష్,కోలా ఉమా, శ్రీను, పిడుగు విజయ్, అబ్దుల్ హనాన్, పల్లి రమేష్, పల్లి ప్రకాష్, గుండు సతీష్, చాణిక్య బాబురావు, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, మాగంటి నవీన్, ధనికుల కాళీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News