Breaking News

జగనన్న మూడేళ్ల పాలన ఒక సువర్ణ అధ్యాయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-27వ డివిజన్ 198 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 27 వ డివిజన్ 198 వ వార్డు సచివాలయం పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,224 గృహాలలో, 216 గడపలను సందర్శించారు. అన్ని శాఖల అధికారులు గుమ్మం వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వంలో తమకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజాప్రతినిధులకు వివరించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక మహా యజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. జవాబుదారీతనంతో ఇంటింటికీ తిరిగి ప్రజల విలువైన సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్మిక, కర్షక, మహిళ, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు హర్షించేలా సువర్ణ పాలనను అందిస్తున్నట్లు వివరించారు. నవరత్నాల పథకాలను ప్రజలు ఏవిధంగా స్వాగిస్తున్నారో.. అదే విధంగా వాలంటీర్లను కూడా ఆశీర్వదిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 96 వార్డు సచివాలయాలు ఉండగా.. ప్రతిఒక్క సచివాలయ పరిధిలో సగటున రూ. 3 కోట్ల సంక్షేమాన్ని మూడేళ్లలో అందించినట్లు వివరించారు. అనంతరం తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. బావాజీపేటలో రూ. 45 లక్షల నిధులతో చేపట్టనున్న రహదారులు, యూజిడి పనులకు సంబంధించి తక్షణమే షార్ట్ టెండర్ కు ఆహ్వానించి వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ప్లకార్డులతో విద్యార్థుల ఘన స్వాగతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గడప గడపకు పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు విద్యార్థినీవిద్యార్థుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ “థ్యాంక్యూ జగన్ మామ” అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. మేనమామగా చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం అమ్మఒడి, నాడు–నేడు కింద పాఠశాలల్లో సకల వసతుల కల్పన, గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్.. ఇలా చేయగలిగినంతా సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే పాఠశాల విద్యకు గత మూడేళ్లలో రూ. 202.31 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. జగన్ మామ అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుది డైవర్షన్ పాలిటిక్స్
వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలతో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మల్లాది విష్ణు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల మంది వివిధ విభాగాల సిబ్బంది బాధితులకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు. సహాయక బృందాలు చేరలేని విపత్కర స్థితిలోనూ హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, నిత్యావసర సరుకులను అందించడం జరిగిందన్నారు. దీంతో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి స్పందన కరువైందని మల్లాది విష్ణు విమర్శించారు. చేసేది లేక ప్రతిపక్ష నేత డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని ఆరోపించారు. ముంపు గ్రామాలకు వెళ్లిన చంద్రబాబు వరద బాధితుల గురించి కాకుండా.. శ్రీలంక గురించి మాట్లాడటమే ఇందుకు నిదర్శనమన్నారు. అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో హుదూద్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన చంద్రబాబును బాధితులు ఏవిధంగా నిలదీశారో ప్రజలందరికీ తెలుసన్నారు. కనుక ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ఎన్ని తప్పుడు సంకేతాలు పంపించినా.. పచ్చ మీడియా వార్తలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఆర్.ఐ.(రెవెన్యూ) ప్రసాద్, నాయకులు భోగాది మురళి, బొప్పన గాంధీ, కురిటి శివ, లంకా కుమార్, మందా రాము, శీలం భవానీ రెడ్డి, వి.బి.ఆచారి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *