Breaking News

నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై శాఖా పరమైన చర్యలు తప్పవు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సమస్యల పరిష్కారం వార్డ్ సచివాలయాల్లోనే జరగాలని, స్థానిక సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై శాఖా పరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించి కొన్ని ఆర్జీల పరిష్కారంలో జాప్యం పై విభాగాధిపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకే వార్డ్ సచివాలయ వ్యవస్తను అమలు చేస్తుందని, అందుకు తగిన విధంగా కార్యదర్శులు, వాలంటీర్లు సచివాలయం పరిధిలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పై సమగ్ర అవగాహన కల్గి ఉండి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సచివాలయం పరిధిలో సాధ్యం కాని వాటిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. స్థానికంగా సచివాలయంలో అర్జీ దాఖలు చేసినా పరిష్కారం కాలేదని, తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సచివాలయాలలో అర్జీలు అందించాలని తెలియచేయాలని ఆదేశించారు. అలాగే స్పందనలో వచ్చే అర్జీలను సమగ్ర సమాచారం, మరియు పరిష్కారాలతో నిర్షేశిత గడువులోగా క్లోజ్ చేయాలని, అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లను విభాగాధిపతులు పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాల్సిన భాద్యత విభాగాధిపతిదేనని తెలిపారు.
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం నందు 47 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 17, ఇంజినీరింగ్ విభాగం 14, ప్రజారోగ్య విభాగం 7, రెవెన్యూ విభాగం 5, ఉపా సెల్ 2, అకౌంట్స్ విభాగంకు సంబధించి 1, ఎడ్యుకేషన్ విభాగంకి సంబంధించి 1 ఫిర్యాదు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, యస్.ఈ. డి.శ్రీనివాస్, ఇంచార్జి సిటి ప్లానర్ మూర్తి, సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు, సెక్టారల్ అధికారులు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *