Breaking News

జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహ నిర్మాణాల పనుల ప్రస్తుత ప్రగతిపై నగరంలోని కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌ డిల్లీరావు, మంగళవారం మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడివోలు, గృహ నిర్మాణ శాఖ ఏఇ, డిఇలు, ఇఇలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ తదితర శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో గృహా నిర్మాణాల వేగవంతానికి రెవెన్యూ, హౌసింగ్‌, మున్సిపల్‌ కమీషనర్లు, పంచాయతీ రాజ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. నేటి వరకు ప్రారంభం కాని గృహాలను లబ్దిదారులతో త్వరితగతిన ప్రారంభిపచేసేలా చైతన్యవంతులను చేయాలన్నారు. కాలనీలలో గృహా నిర్మాణాలకు అవసరమైన ఇసుక సిమ్మెంట్‌ ఐరన్‌ వంటి మెటిరియల్స్‌ సిద్దంగా ఉన్నప్పటికి ప్రారంభం కాకపోవడం పట్ల సంబంధిత మండల స్థాయి అధికారులను కలెక్టర్‌ వివరణ కోరారు. నిర్మాణాల ప్రగతిని సమీక్షిస్తూ బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్నవాటిని బేస్మెంట్‌ స్థాయికి తీసుకురావాలన్నారు.బేస్మెంట్‌ స్థాయిలో ఉన్నవాటిని రూఫ్‌ స్థాయికి తీసుకురావాలన్నారు. వారం వారిగా లక్ష్యాలను నిర్థేశించుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *