విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గలోని 13వ డివిజన్ లో రామాయణపు స్ట్రీట్ లో అద్దె ఇస్త్రీ బండితో ఉపాధి పొందుతూ ఇబ్బందులు పడుతున్న పోలుకొండ అనుమాయమ్మ కి ఇస్త్రీ బండి మరియు అదేవిధంగా ఇటీవల 13వ డివిజన్ లో గడప గడప కార్యక్రమంలో భాగంగా జెడి నగర్-2 లో పర్యటించినప్పుడు కె.ప్రవల్లిక కి కాలేజ్ ఫీజ్ కట్టాలని 5,000/- నగదును ‘దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్’ ద్వారా అవినాష్ నీరు పేద కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ స్వర్గీయ నెహ్రు గారి ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్,వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News