Breaking News

నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదాన్ని పాటించాలి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 1వ తేది నుండి సింగల్ యూజ్ ప్లాస్టిక్ (75 మైక్రాన్ల ) కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకo నిషేదించాలని ఉత్తర్వులను ప్రజలు స్వచ్చందంగా పాటించాలని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, పిలువునిచ్చారు.
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్లాస్టిక్ నిషేధం పై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం నిషేదము అమలు జరిగేలా క్షేత్ర స్థాయిలో మీరు స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఇందు ప్రధానంగా ప్లాస్టిక్ తో చేసిన ప్లేట్లు, గ్లాసులు, స్పూన్, కప్స్, స్ట్రాలు, స్వీట్ బాక్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్లు, ప్లాస్టిక్ జండాలు, ధర్మకోల్ వంటి నిషేదిత జాబితాలో ఉన్నవని, నిషేదాన్ని ప్రతి ఒక్కరు పాటించేలా చూడలని అన్నారు.
అదే విధంగా నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారించుటలో ప్రతి ఒక్కరు సామజిక భాద్యతగా తీసుకోని విజయవాడ నగరం ప్లాస్టిక్ రహిత నగరం మరియు ఆరోగ్య నగరం అంటూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలని అన్నారు. ప్లాస్టిక్ నివారించి పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ బ్యాగ్లు నివారిస్తూ క్లాత్, జ్యూట్ బ్యాగ్లులను వినియోగించుకొని మనందరం కలసి సమిష్టిగా మన నగరాన్ని ప్లాస్టిక్ రహిత మరియు ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దుకొనుటలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తదుపరి సిబ్బందికి జ్యూట్ బ్యాగ్లు మరియు స్టీల్ గ్లాస్ లను అందించారు.
కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, అదనపు కమిషనర్ (జనరల్) మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శ్రీమతి యం.శ్యామల, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, జాయింట్ డైరెక్టర్ (అమృత్ ) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, జోనల్ కమిషనర్లు మరియు యు.సి.డి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *