Breaking News

కాపు నేస్తం కింద 29,824 మంది లబ్దిదారులకు రూ. 44.73 కోట్ల రూపాయలు…

రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వైఎస్ ఆర్ కాపు నేస్తం కింద 29,824 మంది లబ్దిదారులకు రూ. 44.73 కోట్ల రూపాయలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.మాధవీలత గురువారం ఒకప్రకటనలోతెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం రాష్ట్రముఖ్యమంత్రి వైఎస.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కాపునేస్తం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా లో నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఈకార్యక్రమానికి మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,లబ్దిదారులు పాల్గొంటారని కలెక్టరు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *