కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పురపాలక సంఘ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఓల్డ్ బ్రిడ్జి పేట నందు గల అంబేడ్కర్ పార్కును డ్వాక్రా సంఘ మహిళల0దరు కలిసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చైర్ పర్సన్ బావన రత్న కుమారి మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ఒక్కరు తమ ఇంటితోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీని కోసం ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలి అన్నారు. దీనికోసమే మెప్మా అధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు , అదే విధంగా పార్కులు కూడా శుభ్రం చేస్తున్నారని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ లు మన్నే పద్మ, గండ్రోతు అంజలి దేవి, డ్వాక్రా మహిళలు,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ జ్యోతి మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News