విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పులు ఎంత? ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అప్పుని అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న తెలంగాణతో పోల్చటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారము ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, తీసుకున్న అప్పులు ఆదాయంతో పోల్చి చూస్తారా? లేదా ధనిక రాష్ట్రాలతో పోల్చి చూపించే రాష్ట్ర ప్రజలను మభ్యపెడతారా? తెచ్చిన అప్పు లు ఎంత? ఆదాయం, వసతులకు ఎంత ఖర్చు పెట్టారు అని ప్రశ్నించారు. నిర్మల సీతారామన్ రాష్ట్ర అప్పులు 3,98,903 కోట్లు అంటే ప్రత్యక్షముగా తెచ్చిన వి అని చెప్పాలి గాని మొత్తం అప్పులు అని చెప్పటం సరికాదన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ కరోనా వల్ల అప్పు తెచ్చాము అని కొత్త పల్లవి చూస్తుంటే కరోనా ఆదాయానికి మిగతా సమయంలో ఆదాయానికి పెద్ద తేడా లేదు అప్పుపెరిగింది కరోనా వల్లకాదు మీ లోపభూయిష్టమైన ఆర్థిక విధానాల వల్లకాదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం మొత్తం అప్పులు ప్రత్యక్షంగా చేసిన ప్రభుత్వ కార్పొరేషన్స్ ద్వారా చేసిన దీర్ఘకాలిక బిల్లులు పెండింగ్ వున్నవి అన్ని కలిపి ఎంత అప్పువుంది ఎలా తీర్చే మార్గాలు తెచ్చిన అప్పు ద్వారా ఎంత ఆస్తులను ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాలకు వాడారో లాంటి వివరాలు శ్వేతా పత్రం విడుదల చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా 2014 నుంచి 2021 వరకు మొత్తం ఆర్థిక అంశాలు మీద శ్వేత పత్రం విడుదల చేయాలని, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఆర్థిక విధానం ఎలా ఉండాలని, ప్రస్తుతం ఎలా ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎపీపీఎఫ్ సంయుక్త కార్యదర్శి పావులూరి ఖాజారావు, కార్యదర్శి బొప్పన రాజశేఖర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News