-ఐసిడిఎస్ సిడిపివో జి. మంగమ్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్ జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోగల అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ సిడిపివో జి మంగమ్మ ప్రకటనలో తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు-2 పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహయకురాలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రాజెక్టు-2 పరిధిలో 25వ డివిజన్‌లో కొత్త వంతెన-2 అంగన్‌వాడీ కేంద్రం నందు ఓసి కేటగిరిలో 11వ డివిజన్‌లోని జార్జిపేట అంగన్‌వాడీ కేంద్రంలో ఎస్సీ కేటగిరిలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. 28వ డివిజన్‌లోని భానునగర్ 2 అంగన్‌వాడీ కేంద్రంలో ఓసి కేటగిరిలోను 15వ డివిజన్ లోని మారుతి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో బిసి-బి కేటగిరిలోను, 26వ డివిజన్ రామలింగేశ్వరనగర్ -5 అంగన్‌వాడీ కేంద్రంలో ఓసి కేటగిరిలో రెండవ డివిజన్ గుణదల -4 అంగన్‌వాడీ కేంద్రంలో ఓసి కేటగిరిలో 14 డివిజన్ దర్శి పేటలో ఓసి కేటాగిరి 17డివిజన్ కృష్ణలంక రాణిగారి తోట -3 అంగన్‌వాడీ కేంద్రంలో ఎస్సీ కేటగిరిలో అంగన్‌వాడీ సహయకురాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.
పై అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడి సహాయకరాలు, ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నుండి ధరఖాస్తులు కోరుతున్నామన్నారు. ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానికురాలైన వివాహితులై ఉండి 10వ తరగతి ఉత్తీర్ణురాలై జూలై 2021 నాటికి 21వ సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు ఎస్సీఎస్టీ బిసి అభ్యర్థులు ధరఖాస్తులతో పాటు కుల దృవీకరణ పత్రాలను జత చేయాలని నివాస చిరునామాన్ని దృవీకరిస్తూ ఆధార్, లేదా రేషన్‌కార్డును జత చేయాలని పూర్తి చేసిన ధరఖాస్తులను ఆగస్టు 8వ తేది లోపల పెనమలూరు మండలం కానురులో గల సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం అధికారిణి ఐసిడిఎస్ ప్రాజక్టు -2 కార్యాలయంలో అందజేయాలని సంక్షేమ అధికారి సిడిపివో జి మంగమ్మ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News