విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ భారతీయ బహుళజాతి సంస్థ క్రిషి రసాయన్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ వారు సంయుక్తంగా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో రూపొందించబడిన “పౌషక్” సూపర్ స్టార్ అనే నూతన ఉత్పాదనను స్థానిక విజయవాడ, రింగ్ రోడ్, యంహెస్ఆర్ కన్వెన్షన్ హాలు నందు ఏర్పాటు చేసిన పంపిణీదారుల సమావేశంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో కంపెని ప్రెసిడెంట్ పి. సురేష్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎ. ఆంజనేయులు, ప్రొడక్ట్ మేనేజర్ రూజు గుప్త తదితరులు పాల్గొన్నారు.
కంపెని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పి. సురేష్ రెడ్డి మాట్లాడుతూ క్రిషి రసాయన్ ఎక్స్ పోర్ట్స్ ప్రై. లిమిటెడ్ తన మొదటి పేటెంట్ ఉత్పత్తి పౌషక్ సూపర్ స్టార్ ఈ రోజు వాణిజ్య పంటలకు మారు పేరైన ఈ ప్రాంతంలో ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. పౌషక్ సూపర్ స్టార్ అనేది సిఐబి ఆమోదం పొంది పంటలలో అధిక దిగుబడి పెంచే సరిక్రొత్త ఉత్పాదన, ఇది మొక్క అభివృద్ధిని వేగవంతం చేయటంలో సహాయపడుతుందన్నారు. ఆక్సిజన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది, వాతావరణ మార్పులను తట్టుకుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంపెనీ జనరల్ మేనేజర్ ఎ.ఆంజనేయులు మాట్లాడుతూ క్రిషి రసాయన్ గ్రూప్ గత కొన్ని సంవత్సరాలుగా నేల ఆరోగ్యం, మొక్కల పోషణ ఉత్పత్తులైన మైక్రో ఆల్గే ఆధారిత మైక్రో-న్యూట్రియెంట్స్, కె మ్యాక్స్ ఎనర్జీ వంటి బయోస్టిమ్యులెంట్స్, కాజుకి ఎనర్జీ మరియు మసాకి ఎనర్జీ వంటి వాటిపై దృష్టి సారించిందన్నారు. పేటెంట్ ప్రొడక్ట్ పౌషక్ సూపర్ స్టార్ ని ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేకమైన ఉత్పత్తులను తీసుకురావడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. మెరుగైన సేవలు మరియు విజ్ఞానం కోసం రైతులకు సాధికారత కల్పించేందుకు త్వరలో “భౌతిక కృషజ్ నాలెడ్జ్ కేంద్రం” ప్రారంభించే ప్రణాళిక గురించి వివరించారు.
ప్రొడక్ట్ మేనేజర్ రూబీ గుప్త మాట్లాడుతూ క్రిషి రసాయన్” విలువలు, సూత్రాలపై పనిచేయడానికి ప్రసిద్ధి చెందిన సంస్థ క్రిష్ రసాయన్ పెద్ద ఎత్తున నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చడానికి సమాజం కోసం పని చేయడానికి క్రిష్ణాజ్ ఫౌండేషన్ ను ప్రారంభించింది. భారతదేశంపు మొట్ట మొదటి పేటెంట్ పొంది మరిన్ని పూలు & పండ్లు. నాణ్యమైన దిగుబడి పొంపొందించే ఉత్పాదన పౌషక్ సూపర్ స్టార్ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పరిశోధనా సంస్థలతో మా పరిశోధన మరియు సహకారాలతో క్రిషి రసాయన్ రాబోయే రోజుల్లో రైతులకు అత్యుత్తమ ఉత్పత్తులను అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాలకు చెందిన సుమారు 300 మంది డీలర్లు పౌషక్ సూపర్ స్టార్ ప్రారంభానికి హాజరయ్యారు.
Prajavartha Online Telugu News