Breaking News

వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తా…

-యడ్లపాటి రఘునాధబాబు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నేను నా జీవితాంతం వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తానని,రైతుల సంక్షేమానికి పాటు పడతానని టుబాకో బోర్డు చైర్మన్ గా పదవీ విరమణ చేసిన యడ్లపాటి రఘునాథబాబు పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీ ఆదివారం మధ్యాహ్నం గుంటూరులోని రామన్నపేట ఒకటవ లైన్ లో గల మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హల్ లో జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన యడ్లపాటి రఘునాధబాబు అభినందన సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యడ్లపాటి రఘునాధబాబు ప్రసంగిస్తూ భారతదేశంలో గత మూడు సంవత్సరాలుగా పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని, పొగాకు రైతులకు మంచి ధర లభించడానికి విదేశాల నుండి ఆర్డర్లు పొందటంలో సఫలీకృతం అయ్యానని వివరించారు.గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. టుబాకో బోర్డు చైర్మన్ గా ఢిల్లీలో దాదాపు 20 మంది కేంద్ర మంత్రులతో వ్యవసాయం మరియు ఇతర రంగాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపే అవకాశం, లోతైన విషయాలను అవగాహన చేసుకునే పరిస్థితి కలిగిందని పేర్కొన్నారు.ప్రతి కిలో పొగాకు తయారికి నాలుగు కిలోల వంటచెరుకును ఉపయోగిస్తున్నారని తద్వారా చెట్లను నరకడం జరుగుతుందని దీనిని నివారించడానికి లక్షలాది మొక్కలను నాటడానికి కృషి చేశారన్నారు.ఈ అభినందన సభకు ప్రధాన వక్తగా విచ్చేసిన మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాదరావు ప్రసంగిస్తూ యడ్లపాటి రఘునాధ బాబు టీవీ చర్చలలో, రాజకీయ ప్రసంగాలలో ఎలాంటి పరుష పదజాలాలు వాడకుండా,బూతు పదాలను దరిచేరనీయకుండా గొప్పగా విశ్లేషించే రాజనీతిజ్ఞుడని వివరించారు.రాజకీయ నేతలందరూ యడ్లపాటి రఘునాథ బాబుని రోల్ మోడల్ గా చూడాలన్నారు.సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ తన స్వగ్రామమైన కారుమంచిని హరిత గ్రామంగా మార్చడానికి 11 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారని కొనియాడారు. నాలుగు దశాబ్దాలుగా యడ్లపాటి రఘునాధ బాబు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవని రాజకీయాలలో విభిన్న భావజాలాలు ఉన్నప్పటికీని కలిసి పనిచేయగలిగామని తెలిపారు. యడ్లపాటి రఘునాథబాబుని ఆదర్శంగా తీసుకొని వివిధ పార్టీల రాజకీయ నేతలు పరుష పదజాలాన్ని వాడరాదని, వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ సమాజ హితం కోరే వారందరూ ఐక్యంగా కృషి చేసి సమాజంలోని లోపాలను నివారించడానికి ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పటాన్, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతి, జన చైతన్య వేదిక కార్యదర్శి కంది పున్నారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు తుళ్లూరు సూరిబాబు, చారిత్ర అధ్యాపకులు పాలేరు పోతురాజు, రిటైర్డ్ ప్రిన్సిపల్ దేవరపల్లి పేరిరెడ్డి, దీక్ష పౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణ, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ అభినందన సభలో యడ్లపాటి రఘునాథ్ బాబు కి శాలువాలు కప్పి, మేమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *