-ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందింగా విద్యుత్ శాఖ కు ప్రభుత్వం ఆదేశం
-విధ్యుత్ రంగం బలోపేతం చేయడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
-ఈ దృష్ట్యా ప్రజల భాగస్వామ్యం పెంపొందించుకోవాలి
-సబ్ స్టేషన్ లెవెల్ లో మీటింగ్ నిర్వహించి వినియోగదారుల అభిప్రాయాలు తీసుకోండి
-రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
-ఉదాహరణకు విశాఖపట్నం ఏరియా లో 2018 -19 లో 6696 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా అది 2021-22 లో 8164 మిలియన్ యూనిట్లకు పెరిగింది
-విశాఖపట్నం లో గణనీయంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
-వైజాగ్ లో 21.9 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది
-రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలక పాత్ర – ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-గ్రామా స్థాయి నుండి విద్యుత్ రంగాన్ని పాటిస్తాం చేయాలదన్నే లక్ష్యం
-విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్య లో ప్రజాభిప్రాయమే గీటురాయి
-ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వ అధికారులు అభినందించారు
-ఉజ్వల్ భారత్ పై రాష్ట్రానికి కేంద్రం ప్రశంస
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ రంగంలో వినియోగదారుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఇంధన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల విద్యుత్ రంగం మరింత బలోపేతం అవడమే కాకుండా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చునని విద్యుత్ రంగంలో అమలు చేస్తున్న నవరత్నాలు వంటి పథకాలలో మరింత మంది ప్రజలను భాగస్వాములు చేయవచ్చునని ప్రభుత్వం సూచించింది.
వినియోగదారులకు 24×7 నాణ్యమైన, నమ్మకమైన నిరంతర విద్యుత్ ను చౌక ధరలకే అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ప్రజల భగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఇంధన రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ రంగంలో అమలు చేస్తున్న వివిధ పథకాలలో గ్రామాల నుండి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయాలనీ ప్రభుత్వం భావిస్తుంది. దీనివ్లల ఆయా పథకాలు అమలవుతున్న తీరు పై ప్రజల నుండి ఎప్పటికపుడు సమాచారం అందుకోవడంతో పాటు విద్యుత్ సరఫరాను మరింత మెరుగైన రీతిలో సమర్ధవంతంగా నిర్వహించవచ్చునని భావిస్తుంది. వినియోగదారుల నుంచి సేకరించే సమాచారంతో మరింత నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించే వీలుంటుందని భావిస్తుంది.
ఈ దృష్ట్యా ఒక సమగ్ర ప్రణాలికను రూపొందించాలని ఇంధన శాఖకు ప్రభుత్వం సూచించింది. దీనిలో భాగంగా విధ్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో వినియోగదారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు పరిగణంలోకి తీసుకోవాల్సిందిగా సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు తీసుకున్న పటిష్ట చర్యల వల్ల రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎంత విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ వినియోగదారులకు విజయవంతంగా 24×7 విద్యుత్ సరఫరా చేయగలిగాయి. అంతేగాక రాష్ట్రంలో ఆర్థిక కార్య కలాపాలు పెరగడం వల్ల విదుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు విశాఖపట్నం ఏరియా లో 2018 -19 లో 6696 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా అది 2021-22 లో 8164 మిలియన్ యూనిట్లకు పెరిగింది . అనగా 21.9 శాతం విద్యుత్ వినియోగం ఆ ప్రాంతము లో పెరిగింది . ఈ నేపథ్యంలో పెరుగుతున్న పారిశ్రామిక విధ్యుత్ డిమాండ్ ను అందుకునేందుకు 10 గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. అదే విధంగా రాష్ట్రంలో జులై -2018 లో విద్యుత్ డిమాండ్ 5081 మిలియన్ యూనిట్లు ఉండగా , జులై-2022 నెలలో ఇప్పటివరకు 5312 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. .
విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు – వాటికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు -విద్యుత్ రంగానికి సంబంధించి తదితర అనేక అంశాల పై ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ మంత్రి కి వివరించారు.ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై విధంగా తెలుపుతూ… విద్యుత్ రంగాన్ని సుస్థిరం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకమైన నవరత్నాలు, విద్యుత్ సరఫరా-పంపిణి నష్టాల తగ్గింపు, వ్యవసాయ పుంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, ఇంధన సామర్థ్యం , పునరుత్పాదక ఇంధనం, తదితర అంశాలతో పాటు , కేంద్ర ప్రభుత్వ పథకాలైన డీన్ దయాల్ గ్రామీణ జ్యోతి యోజన (డీ డీ యూ జీ జె వై ), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం (ఐ పీ డీ ఎస్ ) కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా విశాఖపట్నంలో ఏ పీ డిసాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీ డీ ఆర్ పీ ) ప్రైజెక్టు ను చేపట్టారు. దీని ద్వారా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా విద్యుత్ సరఫరా చేసే నిమిత్తం ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది.
అలాగే నవరత్నాలలో భాగంగా ఎస్సి, ఎస్టీ , బీసిలలో అర్హులైన వినియోగదారులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఇటువంటి పథకాల అమలులో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములు చేయడం వలెనే ఈ పథకాలు విజయవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల వినియోగదారులకు అందించే సేవలు కూడా మరింత మెరుగయ్యేందుకు అవకాశం ఉంది. “మాది ప్రజా ప్రభుత్వం . మా ప్రతి నిర్ణయానికి ప్రజాబిప్రాయమే గీటురాయి. ప్రజా భాగస్వామం ఉంటేనే ఏ పథకమైన విజయవంతమవుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తాము . ఆ ప్రకారమే మా ప్రభుత్వం నడుచుకుంటుంది” , అని మంత్రి తెలిపారు.
ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య మహోత్సవం గురించి మంచి స్పందన లభించిందని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు . ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వ అధికారులు అభినందించారని తెలిపారు.
. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా జాగ్రత్తలు వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు దిగుమతులుచేసే అవకాశాన్ని విద్యుత్ శాఖ పరిశీలిస్తుంది.
రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ అందుకునేందుకు, దాదాపు 31 లక్షల టన్నుల బొగ్గును తీసుకునేందుకు ఏ పీ జెన్కో , ఏ పీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే చర్యలు తీసుకుందని సి ఎం డీ ఏ పీ ట్రాన్స్‌కో, బీ శ్రీధర్ తెలిపారు .
30 జూలై-2022 న , AP డిస్కమ్‌లు 202.384 MU డిమాండ్‌ను అందుకుంది మరియు 2021 లో అదే రోజున 194.66 MU గా డిమాండ్ నమోదైందని అధికారులు తెలియజేశారు. 202.384 MU డిమాండ్‌ను థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నుండి 59 MU, హైడల్ నుండి 15.14 MU, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుండి 46.54 MU, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుండి 18.78 MU, పవన విద్యుత్ నుండి 5 MU, సోలార్ నుండి 23 MU మరియు మార్కెట్ నుండి 32 MU కొనుగోళ్లు జరిగాయి .
జె ఎం డీ ఏ పీ ట్రాన్స్‌కో , విజిలెన్స్ సెక్యూరిటీ, B మల్లా రెడ్డి, జె ఎం డీ హెఛ్చ్ ఆర్ డీ , అడ్మిన్, ఏ పీ ట్రాన్స్‌కో , I పృధ్వీ తేజ్, డిస్కమ్‌ల సి ఎం డీలు , K సంతోషరావు, J పద్మజనార్దన రెడ్డి, వీ సి, ఎం డీ నెడ్‌క్యాప్ , S రమణారెడ్డి మరియు డైరెక్టర్ గ్రిడ్ ఏ పీ ట్రాన్స్‌కో , ఏ వీ కె భాస్కర్ , డైరెక్టర్ ఫైనాన్స్, కె ముత్తుపాండియన్ మరియు డిస్కమ్‌ల ఇతర డైరెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News