Breaking News

అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబరు 26వ తేదినుండి నిర్వహించనున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లును అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆలయ అధికారులకు సూచించారు. సెప్టెంబరు 26వ తేది నుండి అక్టోబరు 5వ తేది వరకు నిర్వహించనున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాల నిర్వహణపై ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆలయ అధికారులతో సమవేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుండే కాక తెలంగాణ, కర్నాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుండి తరలివస్తారన్నారు. ప్రతి రోజు 30 వేల మందికి పైగా అమ్మవారి దర్శనాని చేసుకుంటారని మూలా నక్షత్రం రోజు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉ౦దన్నారు. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకుని దసరా ఉత్సవాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారుల సూచనలు సలహాలను తీసుకుని సమన్వయంతో ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్ ద్వారా టిక్కెట్ల జారీ చేయడం క్యూ లైన్ల ఏర్పాటు విద్యుత్ దీపాల అలంకరణ త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్యం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. భక్తులకు ఉచిత అన్నదానం ప్రసాదంతోపాటు అవసరమైన ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. దసరా ఉత్సవాలలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు అమ్మవారిని దర్శించుకునేందుకు మార్గదర్శకాలపై ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. కొండపైన దిగువున సూచక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ రెవెన్యూ మున్సిపల్ వైద్య ఆరోగ్య అగ్నిమాపక ఇరిగేషన్ మత్స్య ఆర్అండ్బి పిడబ్ల్యూడి సమాచార పౌర సంబంధాలు తదితర శాఖ అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను చేపట్టి ఉత్సవాలను విజయవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు త్వరతలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఎగ్జిక్యూటర్ ఆఫీసర్ గర్భముళ్ళ భ్రమరాంబ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.వి ఎస్ కోటేశ్వరరావు, ఎల్ రమ, ఏఇవో సుధారాణి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *