Breaking News

ఏపిపిఎస్‌సి పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం…

-పరీక్షలకు 8975 మంది అభ్యర్థులు హాజరు…
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-4) పరీక్షలకు పరీక్షలకు 8975 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. నగరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్షలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పరిశీలించారు. పి బి సిద్దార్థ ఆర్ట్స్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-4) పరీక్షలకు 18,195 మంది అభ్యర్థులు హాజరకావాల్సి ఉండగా 8975 మంది అభ్యర్థు హాజరయ్యారన్నారు. 49.33 హాజరు శాతం నమోదు అయిందన్నారు. పరీక్షల నిర్వహణకు కేటాయించిన 41 కేంద్రాలలో పటిష్టమైన ఏర్పాట్లతో విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన్నట్లు ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు 41 ఛీఫ్‌ సూపర్‌వైజర్లు, 41 అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు నియమించామన్నారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరం విద్యుత్‌ సరఫరా అందించడం ప్రత్యేక మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పరీక్ష కేంద్రం సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేసేలా ఆదేశాలు జరీ చేయడం జరిగిందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌ పర్యవేక్షణలో అధికారులు సమన్వయంతో ఏపిపిఎస్‌సి జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-4) పరీక్షలను విజయవంతం చేశారని పరీక్షల అనంతరం జవాబు పత్రాలను ఏపిపిఎస్‌సి అధికారులకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. సిద్దార్థ ఆర్ట్స్‌ కళాశాలల పరీక్ష కేంద్రం సందర్శనలో కలెక్టర్‌ వెంట ఛీప్‌ సూపరింటెండెంట్‌ జి చంక్రవర్తి లైజనింగ్‌ ఆఫీసర్‌ వి రాజకుమారి, అసిస్టెంట్‌ లైజనింగ్‌ అఫీసర్‌ రాధిక తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *