-571 అభ్యర్థులకు గాను 555 మంది హాజరు
-గుంటూరు, నెల్లూరు ఒంగోలు ప్రకాశం జిల్లాలతో పాటు కడప, కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలవరకు యెనిమిది జిల్లాల మల్టీ జోన్ లో బాగంగా నగరంలో మాంటిస్సోరి కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు
-జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ ఉద్యోగులకు 42రోజుల సర్వే శిక్షణ పూర్తయిన అనంతరం నిర్వహించే తుది పరీక్షను ఆదివారం నగరంలోని మాంటిస్సోరి కళాశాలలలో నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కమిషనర్ సర్వే సెటిల్మెంట్స్ ఆదేశాల ప్రకారం గుంటూరు నెల్లూరు ఒంగోలు ప్రకాశం తో పాటు కడప కర్నూలు అనంతపురం, చిత్తూరు జిల్లాల ఎనిమిది జిల్లాల మల్టీ జోన్ టు లో భాగంగా నగరంలోని మాంటెస్సోరి కళాశాలలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 575మంది అభ్యర్థులకు గాను 555మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. వీరిలో గత ఆదివారం నిర్వహించిన పరీక్షకు వివిధ కారణాలతో హాజరుకాని 50 మందికి నేడు నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారని జాయింట్ కలెక్టర్ అన్నారు.పరీక్షను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు. పరీక్షకు డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస రావు ఎక్స్టర్నల్ అబ్జర్వర్ గా ను, సహాయ సంచాలకులు జిల్లా సర్వే శాఖ కె సూర్యారావు, జాయింట్ డైరెక్టర్ సర్వే ట్రైనింగ్ అకాడమీ సి హెచ్ వి ఎస్ ఎం కుమార్ లు పర్యవేక్షకులుగా వ్యవహరించారని జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ అన్నారు.
Prajavartha Online Telugu News