విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. *తూర్పు నియోజకవర్గలోని 6వ డివిజన్లో జీవనోపాధి నిమిత్తం సత్తెమ్మ కు మరియు శ్రీనివాస్ కి సెలూన్ షాప్ ఖర్చుల నిమిత్తం రూ.5000 దేవినేని నెహ్రు చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు.
Prajavartha Online Telugu News