Breaking News

సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిలో జగనన్న ముద్ర చెరగనిది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-27వ డివిజన్ 200 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగనన్న ముద్ర శాశ్వతమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 27 వ డివిజన్ – 200 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం సందడి వాతావరణంలో కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి గులాబీతోటలోని కూనపురెడ్డి వారి వీధి, మోహన్ గాంధీ స్ట్రీట్, కూనపురెడ్డి సుబ్బారావునాయుడు వీధి, కాకర్లమూడి వారి వీధి, జంగా వారి వీధి, సూరిశెట్టి కోటయ్య వీధులలో విస్తృతంగా పర్యటించారు. దాదాపు 410 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు, హారతులతో బ్రహ్మరథం పట్టారు. సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్ స్వీకరించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతిఒక్క సమస్యను నూటికి నూరు శాతం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే సైడ్ కాలువల్లో నీరు పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. చివరి వీధులలో వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. రేషన్ పంపిణీకి సంబంధించి వేలిముద్రలు, ఐరీస్ పడని పక్షంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సరుకులను పంపిణీ చేసే విధంగా చూడాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో మహిళ పోలీసులు దిశ యాప్ వినియోగంపై స్థానిక యువతులకు విస్తృత అవగాహన కల్పించారు. 50 మందికి యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని తెలియజేయడంతో పాటు.. వినియోగించే ప్రక్రియను వివరించారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

సమిష్టి కృషితోనే టాప్ 15 లో సెంట్రల్ నియోజకవర్గం
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రజల యోగక్షేమాలపైనే అనుక్షణం దృష్టి సారిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. పౌరులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో, సమస్యల పరిష్కారంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్ 15 లో నిలిచిందని మల్లాది విష్ణు తెలియజేశారు. అధికారులు, సచివాలయ సిబ్బందితో పాటు పార్టీ యంత్రాంగం సమిష్టి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. విమర్శలకు దిగుతున్న ప్రతిపక్ష నాయకులు కళ్లు తెరిచి చూస్తే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కనబడుతుందని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు మాదిరి గ్రాఫిక్స్ మాయాజాలం తమకు తెలియవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ప్రజలకు అపారమైన నమ్మకం ఏర్పడిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 2019 లో జగనన్నపై నమ్మకంతో 151 స్థానాలలో ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలు.. ఈసారి 175 స్థానాలతో భారీ విజయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
12 రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన డివిజన్ పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాలు మరువలేనివని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటివరకు 28 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేసుకున్నామని.. ప్రత్యేకించి 27వ డివిజన్ ప్రజలు చూపిన ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, నాయకులు కురిటి శివ, భోగాది మురళి, బొప్పన గాంధీ, మండా రాము, పసుపులేటి బుచ్చిబాబు, కగ్గా పాండు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *