Breaking News

పారదర్శక ఓటర్ల జాబితా సిద్దం చేస్తున్నాం…

-స్వచ్చందంగా ఆధార్‌ – ఓటర్‌ కార్డుకు అనుసందానంపై ఓటర్లను చైతన్యవంతులు చేయండి
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చందంగా ఆధార్‌ – ఓటర్‌ కార్డుకు అనుసందానంపై ఓటర్లను చైతన్యవంతులు చేయాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసేందుకు అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి స్వచ్చమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
కలెక్టరేట్‌ చాంబర్‌లో సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణలకు నూతన మార్గనిర్దేశకాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో భాగం కావడానికి యువతకు మరిన్ని అవకాశాలు దేశ ఎన్నికల కమీషన్‌ కల్పించిందన్నారు. దీనిలో భాగంగా 17 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఇప్పటికే నమోదు అయిన వారు ఆధార్‌ అనుసందానం చేయాల్సి వుంటుందన్నారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదు అయిన ఓటర్లు 2023 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి ఆధార్‌ నంబరును తెలపాల్సివుంటుందని అయితే ఇది పూర్తిగా స్వచ్చందమని, ఆధార్‌ నెంబరు ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం జరగదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో ఆధార్‌ సంఖ్యను లింక్‌ చేసేందుకు ఎన్నికల సంఘం ఫారం 6 బి ని ప్రవేశపెట్టిందన్నారు. అన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌విధానాలలో ధరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. బూత్‌ స్థాయి అధికారి ఓటర్‌ జాబితాలో ఉన్న వారి ఆధార్‌ నంబరును సేకరించేందుకు ఇంటింటికి రావడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. ఆధార్‌ సంఖ్య ఇవ్వకుంటే దానికి బదులుగా ఫారం 6 బి ధరఖాస్తులో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాలలో ఎదో ఒకటి అనగా ఉపాధిహామి పథకం జాబ్‌కార్డు, లేదా బ్యాంకు పోస్టుఆఫీస్‌ జారీ చేసిన ఫోటోగ్రాఫ్‌తో కూడిన పాస్‌ బుక్‌, కార్మిక మంత్రుత్వ శాఖ జారీ చేసిన ఆర్యోగ భీమా స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెస్స్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, ఫోటోగ్రాఫ్‌తో కూడిన పెన్షన్‌ పత్రం తదితర పత్రాలను సమర్పించవచ్చునని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్ధేశించడం జరిగిందన్నారు. ఫారం 6 ఏ కు సంబంధించి ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల నమోదు విషయంలో ఎటువంటి మార్పులు లేవని అన్నారు. జాబితాలో పేరు తొలగింపుకు నిర్ధేశించిన ఫారం 7కు ఇకపై మరణ దృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందన్నారు. ఫారం 8 సంబంధించి నియోజకవర్గా పరిధిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, కొత్త గా ఓటరు గుర్తింపు కార్డు జారీ, దివ్యాంగుల వ్యక్తులను గుర్తించడం వంటి అంశాలకు వినియోగించడం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఓటర్ల జాబితా సవరణలకు నూతన మార్గనిర్దేశకాలపై గుర్తుంపు పొందిన రాజకీయపార్టీలు, అధికారులతో సమన్వయం చేసుకుని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సహకరించాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
సమావేశంలో కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6, ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసందానానికి సంబంధించిన ఫారం 6 బి పై అవగాహక కల్పించే పోస్టర్లను కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ విడుదల చేశారు.
సమవేశానికి జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రేస్‌ పార్టీ డిస్టిక్ట్‌ జనరల్‌ సెక్రటరీ డి నరసింహరావు, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా డిస్టిక్ట్‌ సెక్రటరి సిహెచ్‌ కోటేశ్వరరావు, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్స్కిస్టు) ప్రతినిధి కె. కళ్యాణ్‌, భారతీయ జనతా పార్జీ డిస్టిక్ట్‌ ప్రెసిడెట్‌ యం ప్రసాద్‌, భారతీయ జనతా పార్జీ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు బి. శ్రీరామ్‌, తెలుగుదేశపార్టీ తరుపున సిహెచ్‌ ఉషారాణి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *