-స్పందనలో 95 ఆర్జీలు నమోదు..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఆర్జీలను పరిశీలించి నిర్థేశించిన గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమార్, డిఆర్‌వో కె.మోహన్ కుమార్, డ్వామా పిడి జె. సునీతలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు సమర్పించిన ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో ఆర్జీలు సమర్పించే ఆర్జీదారులకు శాశ్వత పరిష్కారం చూపడం ద్వారా ప్రజలలో నమ్మకం ఏర్పాడుతుందన్నారు. పరిష్కారానికి విలుకాని ఆర్జీలపై సంబంధిత ఆర్జీదారులకు వివరించాలన్నారు. పరిష్కారం కాని ఆర్జీలకు సరైన వివరణ ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందిన ఆర్జీలపై సంబంధిత శాఖ అధికారులకు అవగాహన ఉండాలన్నారు. ఆర్జీలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కారానికి వీలుఅవుతుందన్నారు. ఆర్జీలు రీఒపెన్ కాకుండా ప్రాధమిక దశలోనే పరిష్కరించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ పరిధిలోనే ఆర్జీలను పరిష్కరిస్తే జిల్లా స్థాయి వరకు ఆర్జీదారుడు వచ్చే అవకాశం ఉండదన్నారు. అర్జీలను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత డాక్యుమెంట్లను ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. స్పందన కార్యక్రమంలోనే కాకుండా అర్జీలు గ్రామ వార్డు సచివాలయం 1902 కాల్ సెంటర్, మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ తదితర గ్రీవెన్స్ ద్వారా నమోదవుతాయన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో 95 అర్జీల నమోదు అయ్యాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ 37, పోలీస్ 14, యంఏయుడి 12, విద్య 7, సర్వే అండ్ సెటిలిమెంట్ 5, కార్పొరేటివ్ సోసైటీ మూడు కాగా ఎంప్లాయిమెంట్, సోషల్ వెల్ఫెర్, రిజిస్ట్రేషన్, అటవీ, హౌసింగ్ తదితర శాఖలకు రెండేసి ఆర్జీలు మిగిలిన వివిధ శాఖలకు చెందినవి ఏడుగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు.
ప్రధానంగా నమోదైన ఆర్జీలు ఈ విధంగా ఉన్నాయి..
మైలవరం మండలం ముర్సుమిల్లి శివారు ములకలపంట గ్రామానికి చెందిన సిహెచ్ సామాజ్య్రం ఆర్జీ ఇస్తూ తాను 30 సంవత్సారాలుగా సాగు చేసుకుంటున్న తన భూమి అక్రమణకు గురి అయిందని తనను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూమికి సంబంధించిన రికార్డులను ఆర్జీలతో సమర్పింస్తున్నానని ఇందుకు సంబంధించి పాస్ బుక్ ఇప్పించవలసిందిగా ఆర్జీ సమర్పించాలరు.
జగ్గయ్యపేట మండలం తండాత్రిపుర వరం గ్రామ రైతులు ఆర్జీ ఇస్తూ 101 లింకుల డొంక రోడ్డు అక్రమణకు గురి అయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దీనిని యదాతదంగా ఇప్పించి వ్యవసాయ కార్యాకలపాలకు అనుగుణంగా డొంక రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరారు.
వత్సవాయి మండలం మంగోల్లు గ్రామానికి చెందిన ఎన్ వెంకటేశ్వరరావు ఆర్జీ ఇస్తూ తనకు ప్రైమీనిష్టర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటి స్కిమ్ ద్వారా 10 లక్షలు మంజూరైయిందని ఇందుకు సంబంధించి మిషనరీ ఏర్పాటు చేసుకున్నానని అయితే విద్యుత్ కనక్షన్‌కు సంబంధించి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమస్యలను పరిష్కరించాలని కోరారు.
నగరంలోని రామకృష్ణాపురంకి చెందిన షేక్ నాగూర్ భాషా ఆర్జీ ఇస్తూ తనకు చెందిన స్థలంలో కొంతమంది వ్యక్తులు అక్రమణంగా 40 గజాల స్థలంలో ప్రహరి గోడ నిర్మించారని దీనిపై తనకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News