Breaking News

ప్రజల వద్దకే పాలన సీఎం జగనన్న లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-29వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమ పథకాలు ప్రజ‌ల హ‌క్కుగా జగనన్న ప్రభుత్వం పాల‌న సాగిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 29 వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 240 గడపలను సందర్శించి అర్జీలు స్వీకరించారు. సచివాలయ పరిధిలో ప్రధానంగా మురుగునీటి పారుదల వ్యవస్థపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అయ్యప్ప వీధి, పప్పులమిల్లు రోడ్డు, ఉలవచారు కంపెనీ రోడ్డులో సైడ్ కాల్వలను పునరుద్దరించాలని సూచించారు. అనంతరం వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. బూస్టర్ డోస్ వేయించుకున్నారా..? లేదా..? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడంపై పలువురికి అవగాహన కల్పించారు. పాదయాత్ర ద్వారా పరిష్కృతమైన పలు సమస్యలకు సంబంధించి లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.

మధురానగర్ సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి
మధురానగర్ అంతలా అభివృద్ధి చెందిన ప్రాంతం నియోజకవర్గంలోనే మరొకటి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు వెల్లడించారు. 2009-14 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి.. డివిజన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్లు, యూజిడి, వంతెనల నిర్మాణంతో మధురానగర్ ముఖచిత్రమే మారిపోయిందని తెలియజేశారు. మరలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటికే వి.వి.నరసరాజు వీధి ప్రధాన రహదారి నిర్మాణం, కర్మల భవన్, లెక్చరర్స్ కాలనీ పార్కు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో ఇదేవిధంగా కొనసాగుతుందని.. ఒక్కో సచివాలయానికి కేటాయించిన రూ. 20 లక్షల నిధులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అలాగే ఆర్.యు.బి. పనులను కూడా వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని తెలియజేశారు.

విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన పాపం చంద్రబాబుదే
విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయే స్థితికి చేరడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం అసమర్థ, చేతగాని పాలనే ప్రధాన కారణమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు బకాయిలు పెంచి.. గత పాలకులు అడ్డగోలుగా విద్యుత్‌ సంస్థలను నడిపారని ఆరోపించారు. 2014 లో విద్యుత్ సంస్థలకు రూ.20,703 కోట్లు ఉన్న అప్పును రూ.68,596 వేల కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఇవికాకుండా పవర్‌ జనరేటర్లకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుండి రూ.21,540.96 కోట్లకు పెంచడంతో విద్యుత్‌ సంస్థలు ఆర్ధికంగా కుదేలయ్యాయన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనతో అస్తవ్యస్థంగా మారిన విద్యుత్ వ్యవస్థను.. ఈ ప్రభుత్వం గాడిన పెడుతోందని మల్లాది విష్ణు తెలియజేశారు. అనేక సంస్కరణలు, పొదుపు చర్యల ద్వారా క్రమంగా రాష్ట్రంలో విద్యుత్‌ కొరత అదుపులోకి వస్తోందన్నారు. గృహావసరాలకు ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణంగా నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతోందని తెలియజేశారు.

బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలు
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని ఢీకొట్టే సత్తా ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి బోనం సంపత్ కుమార్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలియజేశారు. కనుకనే పార్టీలకతీతంగా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందజేస్తున్న ఈ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సారథ్యంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పార్టీలో చేరిన నాయకులు వెల్లడించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో 36వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బాలిగోవింద్, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు భోగాది మురళి, బంకా భాస్కర్, కంభం కొండలరావు, చీమల గోవింద్, సముద్రపు గోవింద్, కోలా రమేష్, దేవినేని సుధాకర్, పూర్ణిమ, నాగమణి, ప్రియ, పిల్లి జయకృష్ణ, అక్బర్, సుభాని, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *