-జిల్లాలో మూడవ విడత లబ్దిదారులకు రూ.1 కోట్ల 24 లక్షల 70 వేల ఆర్థిక సాయం
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిరువ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి తోడుగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తుందని జిల్లాలో మూడవ విడత 1247 లబ్దిదారులకు రూ 1 కోట్ల 24 లక్షల 70 వేల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుల ఖాతాలలో జమ చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
జగనన్న తోడు పథకం ద్వారా రాష్ట్రంలోని లబ్దిదారులకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలతో జమ చేశారు. ఈ కార్యక్రామాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో కలిసి వీక్షించి లబ్దిదారులకు ఆర్థిక సహాయం చెక్‌ను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జగనన్న తోడు పథకం చిరువ్యాపారుల ఉపాధికి ఊతం కల్పిస్తుందని అన్నారు. నిధులను సద్వినియోగం చేసుకుని కుటుంబం ఆర్థికంగా బలపడేలా వ్యాపారాన్ని నిర్వహించుకోవాలన్నారు. చిరు వ్యాపారస్తులు తమ రోజువారి పెట్టుబడి ఖర్చులకోసం వడ్డీ వ్యాపారస్తులు చుట్టూ తిరగాల్సిన దుస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా వడ్డీ లేని బ్యాంకు రుణాలను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు ప్రభుత్వమే జమ చేస్తుందన్నారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు నమోదు కాని వారు గ్రామ వార్డు వాలంటీర్లను సంప్రదించవచ్చునని సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ అన్నారు. ఫుట్‌పాత్‌ల పైన వీధుల్లో తోపులు బండ్లపై కూరగాయలు పండ్లు ఆహారం పదార్ధాలు విక్రయిస్తూ జీవించేవారు రహదారుల పక్కన టిఫిన్ సెంటర్ నిర్వహించేవారు గంపలు బుట్టలో వస్తువులు అమ్మేవారు సైకిల్ మోటార్ సైకిల్ ఆటోలపై తిరిగి వ్యాపారం చేసుకునేవారు వీరితో పాటు చేనేత సాంప్రదాయ చేతి వృత్తి కళాకారులకు జగనన్నతోడు పథకం వం ఉపాధికి ఊతం కల్పిస్తుందని అన్నారు. తీసుకున్న ఆర్థిక సాయాన్ని సకాలంలో బ్యాంకులకు చెలించి తిరిగి ఆర్థిక సహాయాన్ని పొందలని కలెక్టర్ తెలిపారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసుకునే ఎంతో మంది వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యక్తులపై ఆదారపడడంతో అందినంత వడ్డీలు వసూలు చేసి పేదలను దోచుకుంటున్నారన్నారు. చిరువ్యాపారస్తులు సాంప్రదాయ చేతి వృత్తి కళాకారుల కష్టలను చూసి చలించిన ముఖ్యమంత్రి జగనన్న తోడు గా నిలిచారని ఆమె తెలిపారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ నగరంలో ప్రతి రోజు వేలాదిమంది చిరువ్యాపారులు అనేక వ్యాపారలను చేస్తున్నారన్నారు. సరైన పెట్టుబడి పెట్టుకునే ఆర్థిక సోమత లేక కూలీ పనులపై ఆదార పడి జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పని లేని రోజున పస్తు పడుకునే బాదలేకుండా జగనన్న తోడు ద్వారా వ్యాపారలను ప్రారంభించుకుని కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారన్నారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు, శాసన మండలి సభ్యురాలు టి. కల్పలతరెడ్డి, విశ్వ బ్రహ్మన కార్పొరేషన్ చైర్మన్, తోలేటి శ్రీకాంత్, కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషు, భట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గీతాంజలిదేవి, మైనార్టి కార్పొరేషన్ చైర్మన్ షెర్ ఆసిఫ్, డిప్యూటి మేయర్ అవుతు శైలజారెడ్డి, మెప్మా మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News