మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వంత ఇల్లు కల్గి ఉండటం వ్యక్తికి ఎంతో ఆత్మస్థైర్యం ఇస్తుందనిఎన్ని బాధలు కలిగినా దైర్యం తెచ్చిపెడుతుందని ఒక పూట తిండి తిన్నా,తినకపోయినా తన ఇంట్లో కలిగే మానసిక శాంతి గొప్ప తృప్తిని మిగులుస్తుందనిమాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నంశాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) నిర్వచించారు.గురువారం ఉదయం మచిలీపట్నం మండలం మేకావారి పాలెం గ్రామ పంచాయతీపరిధిలోని నవీన్ మిట్టల్ కాలనీలో 254 మంది లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహపథకం పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పేర్ని నాని, ట్రైకార్ఛైర్మెన్ ఎస్. బుల్లిబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపొతే క్రయ విక్రయాలకు, తమ వారసులకు
హక్కుగా అందించడానికి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉండదని,అందుకోసమే ఓటిఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, సొంత ఆస్తికావాలనుకునే వారికి ఇదో మంచి అవకాశమని, నామమాత్రంగా చెల్లించిరిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని ఆయనవివరించారు. కామేశ్వరి, కరికం భాగ్యలక్ష్మి, అమృతం అంజమ్మ, పామర్తిధనలక్ష్మి, బి. కాశీ , షేక్ హఫియా, కొనసాని సుశీల, వీర్ల ముత్యాలమ్మ, మంచాలఎస్తేర్ ఇలా 243 మంది పట్టాదారుల పేర్లను ఓపిగ్గా చదివి వారి చేతులకు ఆయాఓట్ఎస్ పట్టాలను అందచేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మంది
పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తోందని, ఓ హక్కుగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియకూడా పూర్తి చేసి మరీ వారికి ఇళ్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్ని నానిపేర్కొన్నారు. గతంలో ఇళ్లు పొందినవారికి కూడా ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు
కల్పించేందుకే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టారని చెప్పారు.నవరత్నాల్లో భాగంగా నిరుపేదలకు సొంతింటి కలను జగన్ ప్రభుత్వం అక్షరాల నిజంచేసిందన్నారు.అనంతరం నవీన్ మిట్టల్ కాలనీలో ఆయన 17. 50 లక్షల రూపాయలతో
నిర్మించబడిన హెల్త్ సెంటర్ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత జరిగినగ్రామసభలో ఎమ్మెల్యే స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటిసమస్య గూర్చి అడిగారు. రెండు రోజులకు ఒకసారి నీటి కుళాయిలు వస్తాయని,
మున్సిపాలిటీ నుంచి ఆరు ట్యాంకర్లు నవీన్ మిట్టల్ కాలనీకి వస్తున్నట్లుప్రజలు తెలిపారు. పందుల సమస్య ఇబ్బందిగా ఉందని కొందరు ఎమ్మెల్యే దృష్టికితీసుకువచ్చారు.. 13 మంది పందుల పెంపకదారులకు కాలనీకి దూరంగా స్థలం
కేటాయిస్తామని అక్కడికి వెళ్ళిపోవాలని ఎమ్మెల్యే వారికి సూచించారు..వీధులను శుభ్రం చేసే పారి సత్య కార్మికులు వస్తున్నారా ? చెత్త బండి ఇంటినుంచి వ్యర్ధాలను సేకరిస్తున్నారా ? మురుగునీటి పారుదల వ్యవస్థ ఎలా ఉంది ?సమస్యలకు సంబంధించిన వివరాలు ఎమ్మెల్యే పేర్ని నాని ప్రజల నుంచి అడిగితెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఎస్. బుల్లి బాబు, డ్వామా పి డి ,మచిలీపట్నం ఎంపిడిఓ జి. సూర్య నారాయణ, మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్బాబు,మచిలీపట్నం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మద్దెల ఆదిలక్ష్మి పాండురంగారావు,
కార్పొరేటర్ ఏకసిరి వెంకటేశ్వరరావు, గిరిజన నాయకుడు మద్దెల రామకృష్ణ. గౌరీపాండురంగారావు (చిన్న రంగా), మాజీ సర్పంచ్ మేకా శ్రీనివాసరావు, మేకా నాని,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు,
వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News