Breaking News

పశ్చిమ నియోజక వర్గ పరిధిలో ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ వారు కలెక్టర్, NTR జిల్లా,విజయవాడ మరియు కమీషనర్ నగరపాలక సంస్థ వారి ఆదేశాల మేరకు 79-విజయవాడ పశ్చిమ నియోజక వర్గ పరిధిలో ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమము-2023 నిర్వహించవలసినదిగా ఆదేశించి యున్నారు . దీని ప్రకారము ది.01.01.2023 నాటికి 18 సం,, నిండిన ప్రతి వ్యక్తి మరియు అర్హులు అయి ఉండి ఇప్పటి వరకు ఓటు హక్కు పొందని వారు ది.09.11.2022 నుండి 08.12.2022 తేదీలలో దరఖాస్తు చేసుకోవలసినిదిగా తెలియజేయడమైనది . సదరు కార్యక్రమములో భాగంగా స్పెషల్ క్యాంపైన్ డేస్ అనగా రెండు శనివారములు మరియు రెండు ఆదివారములు బూత్ లెవెల్ అధికారులు వారికీ కేటాయించిన పోలింగ్ కేంద్రముల వద్ద ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పులు (అనగా మరణించిన, రెండు సార్లు ఓటరుగా నమోదైన వారి పేర్లు తొలగించుట ఇతర తప్పులు అనగా పేరు, ఇంటి పేరు , రిలేషన్ టైపు , రిలేషన్ నేమ్ , జెండర్ తప్పులు మరియు డోర్ నెంబరు ) వుంటే వెంటనే దరఖాస్తులను స్వికరించబడును. ప్రజా ప్రతినిధుల చట్టం 1950 లో అమెండ్మెంట్ సెక్షన్ ప్రకారము మార్పుచేసిన ఫారములు 286, 7,8 లో ధరఖాస్తు చేయవలయును.

ప్రజా ప్రతినిధుల చట్టం 1950 లో అమెండ్మెంట్ సెక్షన్ 23 ప్రకారము ఆధార్ నెంబర్ తో ఓటర్ అనుసంధానం అను ప్రక్రియను ది.01.08.2022 న ప్రారంబించి యున్నారు. సదరు కార్యక్రమము ది.01.08.2022 నుండి 31.12.2022 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రముములో భాగంగా ఓటర్ కార్డు తో ఆదార్ నెంబర్ ని అనుసంధానము అనగా ఫారం-6B దరఖాస్తును 5 types అఫ్ వెబ్ సైట్లలో అనగా NVSP, VOTER HELPLINE APP, VOTER PORTAL, GARUDA & ERO NET ల ద్వారా ఓటర్ గా నమోదు కాబడిన ప్రతి ఒక్కరు ఫారం-6B దరఖాస్తు ద్వారా ఓటర్ కార్డు తో ఆదార్ నెంబర్ ని అనుసంధానము చేయుటకు అవకాశమును కలిపించియున్నారు.

NVSP, VOTER HELPLINE APP, VOTER PORTAL ఈ అప్లికేషన్స్ ద్వారా ప్రజలు స్వయంగా తమ మొబైల్ ఫోన్లలో ఆన్ లైన్ ద్వారా ఫారం-6B దరఖాస్తును పూర్తి చేసి ఓటర్ కార్డు తో ఆదార్ నెంబర్ ని అనుసంధానము చేసుకోవచ్చును మరియు ప్రజలు స్వయంగా అనుసంధానము చేసిన ఫారం-6B దరఖాస్తుని బూత్ లెవెల్ అధికారులు మీ ఇంటికి విచారణ చేయట ద్వారా ఓటర్ కార్డు తో ఆదార్ నెంబర్ ని అనుసంధానము ప్రక్రియ పూర్తి కాబడును.

GARUDA APP ద్వారా బూత్ లెవెల్ అధికారులు వారికీ కేటాయించిన పోలింగ్ కేంద్రంములలో ఇంటి ఇంటికి తిరిగి ఓటర్ కార్డు తో ఆదార్ నెంబర్ ని అనుసంధానమును చేయుచు మీ వద్ద నుండి ఫారం-6B దరఖాస్తును స్వీకరించెదరు.

ERO NET ద్వారా ప్రజలు పశ్చిమ నియోజక వర్గపు ఎన్నికల కార్యాలయము నందు లభించు ఫారం-6B దరఖాస్తును పూర్తి చేసిన దరఖాస్తులను స్వీకరించబడును.

ఆదార్ కార్డు నెంబర్ లేని వారు ఎలక్షన్ కమిషన్ వారు ప్రవేశ పెట్టిన 11 రకముల గుర్తింపు పొందిన ఆధారములలో ఏదైనా ఒక ఆధారము ఇవ్వవలసినిదిగా తెలియజేయడమైనది.

సదరు SSR-2023 కార్యక్రమము గురించి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ది 03.08.2022 న డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) వారి కార్యాలయంలో సమావేశమును ఏర్పాటు చేసియున్నారు. సదరు సమావేశములో SSR-2023 ది.01.01.2023 నాటికి 18 సం,, నిండిన ప్రతి వ్యక్తి మరియు అర్హులు అయి ఉండి ఇప్పటి వరకు ఓటు హక్కు పొందని వారిని గుర్తించి ఓటు హక్కు పొందే విధముగా చేయుట మరియు చనిపోయిన ఓటర్లను గుర్తించి తీసివేయుట , రేషన్ లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనగా కొత్తగా పోలింగ్ కేంద్రములను ఏర్పాటుచేయుట , పోలింగ్ కేంద్రముల పేర్లు మార్చుట గురించి మరియు ఓటరు జాబితాల సవరణల గురించి సహాయ సహకారములు మరియు తగు సూచనలను సలహాలు గురించి చర్చించియున్నారు. ఈ సమావేశమునకు పశ్చిమ నియోజక వర్గమునకు సంబందించిన అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జే ఉదయ భాస్కర్ ,ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, విజయవాడ , అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి & డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) కుమారి డి వెంకట లక్ష్మి, పశ్చిమ నియోజక వర్గపు ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ మరియు సిబ్బంది పాల్గొనియున్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *