గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, రోడ్ల మీద లేదా కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారికి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ప్రజారోగ్య అధికారులకు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ విద్యా నగర్, చంద్రమౌళి నగర్, భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, పారిశుధ్య కార్మికులు మరియు ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత విద్యా నగర్, గుజ్జనగుండ్ల వాటర్ ట్యాంక్ ల వద్ద డంపర్ బిన్స్ వద్ద చెత్త పడిఉండటం గమనించి, సంబందిత శానిటేషన్ కార్యదర్శులు, ఇన్సెపెక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో రోడ్ల మీద లేదా కాలవల్లో చెత్త, వ్యర్ధాలు కనిపించడానికి వీలు లేదని, ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి నుండి ఉదయాన్నే ప్రతి రోజు నిర్దేశిత సమయంలో చెత్త సేకరణ చేయాలన్నారు. రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి వారికి అపరాధ రుసుం విధించాలని, షాప్స్ వారు వేస్తె సీజ్ చేయాలని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. మధ్యాహ్నం సమయంలో ప్రతి రోజు గ్యాంగ్ వర్క్ తో కాల్వల్లో సిల్ట్ తొలగింపు, సమస్యాత్మక ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. డంపర్ బిన్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. శానిటరీ ఇన్సెపెక్టర్లు తమ పరిధిలోని శానిటేషన్ కార్యదర్శులతో సమన్వయం చేసుకొని, సచివాలయం వారీగా ఇంటింటి చెత్త సేకరణ, ప్రధాన రహదార్ల శుభ్రం పై పిన్ పాయింట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కూడా సహకరించి, తమ ఇళ్ళల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను ఇంటి వద్దకు వచ్చే ప్రజారోగ్య కార్మికులకే ఇవ్వాలని కోరారు.
పర్యటనలో శానిటరీ ఇన్సెపెక్టర్లు సునీత, ఎన్.వి.ఎస్.ప్రసాద్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News