Breaking News

కార్మికులు తమ సమస్యల పై మీట్ ది కమిషనర్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి గురువారం మీట్ డి కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్మికులు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు లేదా అర్జీలు అందించవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. గురువారం కమిషనర్  ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, మరియు సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కై నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని, కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించనని, భాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్మికులు కూడా తమకు అందే జీతాలు, ఇతర అలవెన్స్ ల పై ఎవరికి ఎటువంటి నగదు ఇవ్వాల్సిన పని లేదని, ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే ప్రతి గురువారం నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు. కార్మికులు తమ సమస్యల పై మీట్ ది కమిషనర్ లో ఇచ్చే వాటిని రిజిస్టర్ లో నమోదు చేసి, నిర్దేశిత గడువులోగా పరిష్కారం జరగాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *