విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శనివారం నాడు 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ కు చెందిన దివ్యంగా బాలుడు నాగేటి గణపతి బాబుకు ట్రస్ట్ ద్వారా అవినాష్ వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీన ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు దివ్యంగా బాలుడు నాగేటి గణపతి బాబు కు వీల్ చైర్ అవసరం ఉందని వారి కుటుంబ సభ్యులు అవినాష్ దృష్టికి తీసుకురాగా శనివారం నాడు ‘దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఆ బాలుడికి అందజేశారు.అంతేకాకుండా భవిష్యత్ లో ఆ బాలునికి ఏ అవసరం ఉన్న ట్రస్ట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్ అమర్నాధ్,తూర్పు కాపు డైరక్టర్ తేజేష్,వైస్సార్సీపీ నాయకులు సంపత్,నామాల కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …