విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి విజయవాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 6వ డివిజన్ 38వ సచివాలయ పరిధిలోని అప్పలనాయుడు వీధి, ఈదా సత్యవతి రోడ్,తోట నారాయణమ్మ రోడ్, గంగళమ్మ గుడి రోడ్ మరియు మేకల బజర్ కొండ అంచు ఉన్న ప్రాంతాల్లో ఇంటిఇంటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలన పట్ల ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారని,వలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా మేము కార్యాలయల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చే పని లేకుండా పారదర్శకంగా పధకాలు అమలు చేస్తున్నారు అని తమ ఆనందం వేళ్ళ బుచ్చుతూ మాకు హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు, రోడ్డు, డ్రైన్ నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ దే అని అన్నారు,స్థానిక పెద్దలు, ప్రజలు కాకని వెంకట రత్నం విగ్రహం పునః ప్రతిష్ఠాలని మా దృష్టికి తీసుకువచ్చారని ఇప్పటికే వైసీపీ నాయకులు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లకు అందుకు సంబంధించిన వినతి పత్రాలు అందజేయడం జరిగిందని వీలైనంత త్వరగా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న కొంతమంది ని వెంట పెట్టుకుని వెళ్లి కమిషనర్ తో విగ్రహ ఏర్పాటు గురుంచి వినతిపత్రం ఇవ్వడం సిగ్గుచేటు అని, అసలు కాకని వెంకట రత్నం విగ్రహం తొలగించింది మీ టీడీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నాడు విగ్రహ తొలగింపు మీద పోరాటం చేసిన వైసీపీ నాయకులు మీద,వెంకట రత్నం కుటుంబ సభ్యుల మీద నడిరోడ్డుపై దాడి చేసి కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు.ఈరోజు వైసీపీ ప్రభుత్వం విగ్రహ ఏర్పాటు కు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ నాయకులు, కుటుంబ సభ్యులు మీ నిర్వాకం వల్ల కోర్టు ల చుట్టూ తిరుగుతున్నారు అని ,మీ షో రాజకీయాలు, డ్రామాలు ప్రజలకు అర్థం అయ్యాయని వారే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ముఖ్యమంత్రి జగన్ పట్ల అచంచల విశ్వాసం, నమ్మకం పెరిగియని మరలా ఆయనే ముఖ్యమంత్రి అని ఆవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాద్, రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరక్టర్ ఇజ్జాడ తేజేష్, వైస్సార్సీపీ నాయకులు అబ్బినాయుడు ,రాజా, వెంకటేష్, హరీష్, సంపత్, ప్రభు మహిళా నాయకులు మాదవి, సుభాషిణి,ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News