Breaking News

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్‌ఎస్‌ బాబు కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేష్‌ బాబు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు, దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్‌ రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *