Breaking News

చారిత్రాత్మకం కానున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలు

-24వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం కార్యాలయం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చాలా చారిత్రాత్మక ఘట్టాలకు నిలయంగా కమ్యూనిస్టుపార్టీ నిలిచిందని, 2022 అక్టోబర్‌ 14 నుండి 18 వరకు విజయవాడలో జరగనున్న పార్టీ 24వ జాతీయ మహాసభలు దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు క్రియాశీలకం కానున్నాయని ఆహ్వాన సంఘం ప్యాట్రన్‌, సీపీఐ సీనియర్‌ నాయకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు వెల్లడిరచారు. విజయవాడ దాసరిభవన్‌ కార్యాలయ ఆవరణలో ఆదివారం సీపీఐ 24వ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘ కార్యాలయాన్ని ఆహ్వానసంఘ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, ఆహ్వాన సంఘ ప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆహ్వాన సంఘం కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ఈడ్పుగంటి ప్రసంగిస్తూ రానున్న అక్టోబర్‌ నెలలో విజయవాడలో జరుగనున్న సీపీఐ అఖిల భారత 24వ మహాసభలు చారిత్రాత్మకం కానున్నాయని చెప్పారు.  1961, 1975లో పార్టీ జాతీయ మహాసభలు, అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగాయని, వాటికి డాంగే, సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి వాళ్ళు నేతృత్వం వహించారని గుర్తు చేశారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ అక్టోబరు 14 నుంచి 18వరకు విజయవాడలో జరగనున్న పార్టీ జాతీయ మహాసభల విజయవంతానికి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, శ్రేయోభిలాషులు, సానుభూతి పరులు కృషి చేయాలని కోరారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ మహాసభలు కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు, కుటుంబానికి ఒక పండుగ లాంటివని చెప్పారు. వాటిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ఆహ్వాన సంఘ కార్యదర్శి అక్కినేని వనజ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు పి.దుర్గాభవానీ, దోనేపూడి శంకర్‌, ఆహ్వానసంఘ ప్రతినిధులు రావుపల్లి రవీంద్రనాథ్‌, జి.కోటేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు, బుడ్డిగ జమిందార్‌, టి.అంజయ్య, వై.చెంచయ్య, డాక్టర్‌ సుజాత, పార్టీ, ప్రజా సంఘాల ప్రతినిధులు వైవీ రావు, సయ్యద్‌ అఫ్సర్‌, మోతుకూరి అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *