విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ద్వారా గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం వలనే సాధ్యం అయ్యింది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్,మెట్లు బజార్ వద్ద నుండి ఇంటిఇంటికి పర్యటించిన అవినాష్ వారికి అందిన సంక్షేమ పథకాల వివరాలను కరపత్రాల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అధిక శాతం ప్రజలు స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వైసీపీ పార్టీకి అభిమానం గా ఉండేవారని అందుకే గత రెండు పర్యాయాలు కూడా ఇక్కడ కార్పొరేటర్ గా మా పార్టీ వారే ఎన్నికయ్యారు అని అన్నారు. ఆ కారణంగా గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ అభివృద్ధి కి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసారని, ప్రజల బాగోగులు పట్టించుకోలేదు అని విమర్శించారు. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక సైడ్ డ్రైనేజీలు, రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.అదేవిధంగా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీ మేరకు దాదాపు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని వీలైనంత త్వరగా నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులో కి తీసుకొస్తామని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేసి ప్రజలు మా మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటామని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. అదేవిధంగా ఇక్కడి ప్రజలకు సౌకర్యం గా ఉండేలా రైతుబజార్ ను,మోడల్ స్కూల్,అర్బన్ హెల్త్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.మా కార్పొరేటర్, నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ మీర్ హుస్సేన్ వైస్సార్సీపీ నాయకులు గోపాల్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, నరేష్, ఫజులుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News