Breaking News

భవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బహుళ అంతస్తు భవనాల నిర్మాణ సమయంలో సెట్ బ్యాక్ లో ఎటువంటి నిర్మాణాలు చేసినా నగరపాలక సంస్థ నుండి ఎన్.ఓ.సి. జారి చేయడం జరగదని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్  నవభారత్ నగర్, విద్యా నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ బహుళ అంతస్తు భవనాలు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్ లు నామమాత్రం కాకుండా పక్కాగా పని చేసేలా కనెక్షన్ చేయాలని, సచివాలయ కార్యదర్శులు పక్కగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం గ్రీనరికి కేటాయింపు ఉండాలన్నారు. కాల్వల్లో సిల్ట్ తీయడానికి వీలుగా ర్యాంప్ లు నిర్మాణం చేసుకోవాలని, లేని వాటిని తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్ల వారీగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి అపరాధ రుసుం విధించడం, షాప్స్ ని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. పర్యటనలో డి.సి.పి. కోటయ్య, ఏ.సి.పి. అజయ్ కుమార్, టి.పి.ఎస్., శానిటరీ ఇన్సెపెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *