Breaking News

గోకవరం జూనియర్ కళాశాలలో కోటి 23 లక్షలతో నాడు నేడు పనులకు శంకుస్థాపన…

-కొత్తపల్లిలో ఆర్బీకే, సచివాలయ భవనాల ప్రారంభోత్సవం

గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మన గొంతుకే మన బలం ఏదైనా అడిగి సాధించుకోవడం మన హక్కని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత విద్యార్థుల నుద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం గోకవరం మండలం గోకవరం జూనియర్ కళాశాలలో నాడు-నేడు పనుల శంఖుస్థాపన, కొత్తపల్లి గ్రామంలో ఆర్బీకే, సచివాలయ భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల తదితరులు పాల్గొన్నరు. ఈ సందర్బంగా కలెక్టరు మాథవీలత మాట్లాడుతూ మహిళల పేరునే ప్రభుత్వం ప్రతి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాల ఆధునీకరణతో పాటు మౌలిక సదుపాయలను కల్పిస్తుందన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకూడదనే లక్ష్యంతో వారి ఉన్నత భవిష్యత్తుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను విద్యకు దూరం కాకుడదని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న వనరులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు విద్యార్థులను కోరారు. ఉన్నత విద్యను అభ్యశించడం వలన మంచి ఉద్యోగావకాశాలు తమ దగ్గరికే వస్తాయన్నారు. ఇదే కళాశాల ప్రాంగణంలో త్వరలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం నాడు-నేడు లో భాగంగా 1,23,56,270 రూపాయలతో జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నామన్నారు.
కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత మాట్లాడుతూ విద్యార్థులతో సమావేశం అంటేనే ఒక నూతన ఉత్సాహాన్ని కలుగుజేస్తుందన్నారు. జగనన్న ప్రభుత్వం మహిళల పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తు,నేడు పుట్టిన పాప నుంచి ఉన్నతవిద్యాభ్యసం వరకు ప్రతి అడుగులోను అండగా నిలుస్తున్నామన్నారు. విద్యా దీవేన, విద్యా కానుక, మద్యాహ్న భోజన పథకం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అమ్మఒడి ద్వారా ఆర్థిక భరోసాను అందిస్తున్నామన్నారు. తద్వారా తల్లి తన బిడ్డకు కావలసిన అవసరాలను తీర్చగలగడం సాధ్యమైనదన్నారు.

శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ గోకవరం జూనియర్ కళాశాలలను డిగ్రీ కళాశాలగా గుర్తించేందుకు ప్రతిపాధనలను సిఫార్సు చేయాలని కలెక్టరును కోరారు. రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి జూనియర్ కళాశాల అభివృద్ది కోసం నాడు – నేడు క్రింద నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాధాలు తెలిపారు.

కొత్తపల్లి గ్రామంలో పలు అభివృద్ది పనులు ప్రారంభం
కొత్తపల్లి గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు, పైపు లైన్లు ఏర్పాటులో భాగంగా జలజీవన్ మిషన్ క్రింద రూ. 146 లక్షల 45 వేల రూపాయలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈ జీఎస్. నిధులు రూ. 40 లక్షలతో చేపట్టిన గ్రామ సచివాలయం -2 భవనాన్నిరూ. 20 లక్షల రూపాయలతో ఆర్బీకే భవనాలను ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలో త్వరలోనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఈ విషయం పై స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేసిన విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు వంగా గీత సిపార్సు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో ఏ.చైత్ర వర్షిని, రీజనల్ జాయింట్ డైరక్టరు ఐ. శారధ, ప్రిన్స్ పాల్ తోట శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ,యంపీపీ సుంకర శ్రీవల్లి, సర్పంచ్ కొమరం శ్రావణి, జగ్గంపేట మార్కెట్ యార్డు చైర్ పర్సన్ జనపరెడ్డి హిమ శైలజ, తాహశీల్థారు దివ్యభారతి,విద్యార్థులు తదితారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *