Breaking News

ఫారం 6 బి లో క్రొత్త ఫారంలో నమోదు చేసే విధంగా బూత్ లెవెల్ అధికారులు చర్యలు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా లో ఆధార్ సంఖ్య ను ఫారం 6 బి లో క్రొత్త ఫారంలో నమోదు చేసే విధంగా బూత్ లెవెల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకూ కేవలం 12.35 శాతం మేర మాత్రమే డేటా సేకరించడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మునిసిపల్ కమీషనర్, కె. దినేష్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం ఆనం కళా కేంద్రంలో నగరపాలక సంస్థ పరిధిలోని బి. ఎల్. ఓ లు, సూపర్వైజర్ , సహాయ ఈ ఆర్ వో లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ , రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 225 బి.ఎల్.ఓ లు కనీసం రోజుకి పది నుంచి 20 కుటుంబాల డేటా సేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. బి ఎల్ వో లు చేపట్టే పనులను ఎన్నికలకు సంబంధించిన విధులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సూపర్ వైజర్ లు ప్రత్యక్ష పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టడం తో పాటు డేటా ఎంట్రీ పనులకు ఎటువంటి తప్పిదాల కు అవకాశం లేకుండా చూడాలన్నారు. ఓటర్ ల జాబితా ప్రామాణికరణ ఉద్దేశ్యం కోసం ఆధార్ సంఖ్య లేదా కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డుతో కూడి నమోదు చేయాలని అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 225 బూత్ ల పరిధిలో 2,51,217 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు, తహశీల్దార్ వి.సుస్వాగతం, ఎలక్షన్ డి టి. ఎమ్. పవన్ కుమార్, సహాయ ఈ.ఆర్.ఓ, లు, బి ఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *