Breaking News

అనధికార నిర్మాణములను చేపట్టిన వారిపై చట్ట రీత్యా తగు చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్ధ, తూర్పు నియోజకవర్గ పరిధిలో రామలింగేశ్వర నగర్, శివగంగ భవాని వీధి మరియు ఠాగూర్ వీధి లోని డోరు నెంబరు: 61-24-7/6 మరియు 61-25/1-12 నందు అనధికారముగా అదనపు అంతస్తు నిర్మాణము చేపట్టుట జరిగినది. సదరు భవన యజమానులు నగర పాలక సంస్ధ నుండి ఎటువంటి అనుమతులు పొందక అనధికారముగా చేపట్టిన నిర్మాణమును కమీషనరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ , ఐ.ఏ.ఎస్, సిటీ ప్లానరు  జి. వి. జి. ఎస్. వి. ప్రసాద్  ఆదేశాల మేరకు సర్కిల్-3 డిప్యూటీ సిటి ప్లానరు మరియు ఎ.సి.పి-3 ఇన్ చార్జ్  జుబేన్ చీరన్ రాయ్ నేపధ్యంలో  వి.కొండల రావు, టి.పి.ఓ మరియు సంబంధిత వార్డు ప్లానింగ్ సెక్రేటరీలు అక్రమ నిర్మాణ నిర్మూలనా దళం వారితో సదరు అనధికార నిర్మాణమును తొలగించడమైనది. కావున ఇందు మూలముగా ప్రజలకు తెలియజేయునది ఏమనగా అనుమతి పొందకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగించబడునని మరియు ఆ విధంగా అనధికార నిర్మాణములను చేపట్టిన వారిపై చట్ట రీత్యా తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *