మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు ప్రయోజనాలే పరమావధిగా, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ఇంకా ఏవైనా అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెడన నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పురపాలక పరిధిలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు పర్యటిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు , అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. స్థానిక 20 వ వార్డు రైల్ గేట్ , కొత్త పేటలోని 302 గడప ఉంటే, రాజులపాటి ఆదిలక్ష్మి, పూరిళ్ల మణీ, దాసరి సుధారాణి, మెట్ల లక్ష్మి , గూడవల్లి వెంకటేశ్వరమ్మ, బొర్రా లక్ష్మి కాంతమ్మ, రాజులపాటి నాగమణి, కాగిత విజయకుమారి, వేణు. వెంకటేశ్వరమ్మ, పరసా కృష్ణకుమారి, పరసా సీత, నరహరశెట్టి కనకదుర్గ తదితరుల ప్రతి ఇంటికి వెళ్లి మంత్రి జోగి రమేష్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ‘మీ ఇంటి వద్దకే వచ్చాం.. సమస్యలేమైనా ఉంటే చెప్పండి’ అని ప్రజల్ని అడిగారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైయస్ జగన్ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు.
మా కుటుంబం కష్టాలలో ఉంది .. దయచేసి కనికరించీ ఒక్క వెయ్యి రూపాయలు సహాయం చేయండని పొరుగువారిని వేడుకొంటే డబ్బు ఉండి ఆపదలో కాపాడలేని కొందరు స్వార్ధపరుల మధ్య బతుకుతున్నామని, అటువంటి పరిస్థితులలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వివిధ పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఏ చోటుకు వెళ్లినా ప్రజలు జేజేలు పలుకుతున్నారని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, వైస్ ఛైర్మెన్ ఎం.డి. ఖాజా, 20 వ వార్డు కౌన్సిలర్ కొసనం కరుణ కుమారి, 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన తహసీల్దార్ పి.మధుసూదన రావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కటకం నాగకుమారి, హోసింగ్ డి ఈ ఏ శ్రీనివాసరావు , వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, ఆహార సలహా కమిటీ ఛైర్మెన్ హనీఫ్ ఖాన్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు దాన భైరవ లింగం, నల్లా నాగలక్ష్మి, ఎం. డి. హఫీజ్, శిరివెళ్ల వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News