Breaking News

ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం..

-నిర్థేశించిన గడువులోపు నిర్మాణాలు పూర్తి చేస్తాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణపనులను వేగవంతం చేసి పురోగతిని సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్థేశించిన గడువులోపు నిర్మాణాలను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్‌ జవహర్‌రెడ్డికి వివరించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవనలైన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినికులు డిజిటల్‌ లైబ్రరీలు తదితర భవన నిర్మాణపు పనుల ప్రగతిపై శనివారం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్‌ జవహర్‌రెడ్డ, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్లు ప్రతి రోజు సమీక్షించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జగన్‌మోహన్‌రెడ్డి భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. సాంకేతిక పరమైన సమస్యలు ఎదురైతే తక్షణమే జిల్లా కలెక్టర్లు వాటిని పరిష్కరించాలని ఆయన సూచించారు. భవన నిర్మాణపు పనులకు అవసరమైన సిమెంట్‌ ఇసుక ఐరన్‌ వంటి నిర్మాణ మెటిరియాల్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి పనులు మరింత వేగవంతం చేయాలని జవహర్‌రెడ్డి సూచించారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా నుండి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 268 గ్రామ సచివాలయాలు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 148 పూర్తయన్నారు. మరో 18 భవనాలు ఫినిషింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయని బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన స్టేజ్‌ కన్వర్షన్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 260 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు గాను 74కు పైగా భవన నిర్మాణాలు పూర్తయాయని మరో 22 భవనాలు ఫినిషింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయన్నారు. 239 వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు గాను 51 భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయని మరో 14 భవనాలు ఫినిషింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయన్నారు. భవనాల నిర్మాణం కొరకు వివిధ సిమెంట్‌ కంపెనీల నుండి 2493 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ కొరకు ఇండెంట్‌ పంపగా 2406.45 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయడం జరిగిందని 86.55 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ సరఫరా చేయవలసి ఉందని జిల్లా కలెక్టర్‌ వివరించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో 10 గ్రామ సచివాలయాలు 30 ఆర్‌బికెలు, 27 వైస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు రెండవ వారంలో 36 గ్రామ సచివాలయాలు 19 ఆర్‌బికెలు, 13 వైస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు అక్టోబర్‌ మొదటి వారంలో 14 గ్రామ సచివాలయాలు 43 ఆర్‌బికెలు, 55 వైస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, రెండవ వారంలో 40 గ్రామ సచివాలయాలు 71 ఆర్‌బికెలు, 79 వైస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు భవనాలను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించి పనులను వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు. 67 బల్క్‌ మిల్క్‌ యూనిట్‌ భవన నిర్మాణాలను అక్టోబర్‌ మాసాంతంలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థల సేకరణ సమస్యల వలన 16 ప్రాధాన్యత భవన నిర్మాణాలను చేపట్టలేకపోయామని మరో 6 భవన నిర్మాణాలకు సేకరించిన స్థలాలు కోర్టు కేసులలో పెండిరగ్‌లో ఉన్నాయని మిగిలిన భవన నిర్మాణాలను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్‌ జవహర్‌రెడ్డికి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *