Breaking News

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ తయారు చేసే కంపెనీలను సీజ్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ తయారు చేసే కంపెనీలను సీజ్‌ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ ఎన్విరాన్‌మెంట్‌ల్‌ ఇంజనీర్‌ టి. ప్రసాద్‌ రావు అన్నారు. పర్యావరణమునకు, జంతుజాలమునకు, మానవ మనుగడకు ఆరోగ్యమునకు హానికరముగా పరిణమిస్తున్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీని వినియోగమును నిషేధించడములో ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమల యజమానుల ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహాకరించి పర్యావరణ పరిరక్షణకు తొడ్పడాలని టి ప్రసాద్‌ కోరారు. పర్యావరణమునకు హానికరముగా పరిణమించిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ను తయారు చేయుచున్న విజయవాడ రూరల్‌ మండలం సూరాయపాలెం గ్రామంలోని యం/ఎస్‌ వరలక్ష్మి పాలిమర్స్‌ తనిఖీ చేసి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లాస్టిక్‌ కవర్లు తయారీకి వినియోగిస్తున్న సుమారు 16.93 టన్నుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారన్నారు. ఈ సందర్భంగా సంబంధిత పరిశ్రమ ప్రతి నిధులైన శ్రీ ఎస్‌ రామరాజు, పి జగన్‌మోహనరావు సమక్షంలో యంఓఎఫ్‌ఎఫ్‌ వారి నియమ నిబంధలకు విరుద్దముగా తయారు చేయబడున్న నిషేధత సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ మెటీరియల్‌ను సీజ్‌ చేసి సీల్‌ చేయుటమే గాక వాటిని డిప్సోజ్‌ చేయడం జరుగుతుందని టి ప్రసాద్‌ తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *