Breaking News

సచివాలయం పరిధిలో పూర్తీ భాధ్యతతో పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో చేపట్టే అభివృద్ధి పనులను ఎమినిటి కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో పూర్తీ భాధ్యతతో పర్యవేక్షణ చేయాలని, పనుల్లో ఎటువంటి లోపాలు జరిగినా తదుపరి చర్యలుకు ఆయా ఎమినిటి కార్యదర్షులే భాధ్యత వహించాల్సి వస్తుందని నగర కమీషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా ఏటి అగ్రహారం, అంకిరెడ్డిపాలెంల్లోని పలు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సి.సి. రోడ్లు మరియు డ్రైయిన్ పనుల నాణ్యతలను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఏటి అగ్రహారం, అంకిరెడ్డి పాలెంల్లో నిర్మించిన వెట్ మిక్స్ రోడ్డు మరియు డ్రైయిన్ కొలతలను యం.బుక్ ప్రకారము ఉన్నది లేనిది పరిశీలించి, ఎమినిటి కార్యదర్శులతో మాట్లాడుతూ పనుల నాణ్యతా ప్రమాణాలను పక్కా పాటించేలా చూడాలని, పరిశీలనలో ప్రతి అంశాన్ని యం.బుక్ నంది రికార్టు చేయాలని, అన్నిదశలలోను జరిగే పనులను ఫోటోలతో ఫైలు మెయింటైన్ చేయాలన్నారు. టెండర్ పొంది అగ్రిమెంట్ ప్రకారం పనులు పక్కాగా జరగాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సచివాలయాల వారిగా పనులను ఏమినిటీ సెక్రటరీలు ఎప్పటికప్పుటు పర్యవేక్షిస్తూ ఇంజినీరింగ్ అధికారులకు పనుల పురోగతిపై వివరములు అందించాలన్నారు.
అనంతరము సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రతి నిర్మాణం నగరపాలక సంస్థ అనుమతి తీసుకున్న ప్లాన్ ప్రకారమే ఉండాలని, అనధికార నిర్మాణాలు, లే అవుట్స్ ఉంటే ప్లానింగ్ కార్యదర్శి పై చర్యలు ఉంటాయన్నారు. ప్రతి నిర్మాణం అసెస్మెంట్ కల్గి ఉండాలని, నూతన భవనాలకు ఎప్పటికప్పుడు పన్ను విధించాలని అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్, ఇంటింటి చెత్త కలెక్షన్ పక్కాగా జరగాలని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ. పి.వి.కె.భాస్కర్, ఈ.ఈ. కొండారెడ్డి, డి.ఈ.ఈ.లు శివ కుమార్, కళ్యాణ రావు, కార్పొరేటర్ అడకా పద్మావతి, ఏ.ఈ.లు, శానిటరీ ఇన్సెపెక్టర్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *